తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఇక బయటకు వచ్చిన తర్వాత అనీ మాస్టర్ కోపంతో ఊగిపోయింది.
తనపై ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై ఒక రేంజ్ లో మండిపడింది.బిగ్ బాస్ కంటెస్టెంట్ కాజల్ విషయంలో తనను నోటికి వచ్చినట్లు విమర్శిస్తుండటంతో అనీ మాస్టర్ తట్టుకోలేకపోయింది.
అలాగే తమ్ముడిలా ఆప్యాయంగా పిలుచుకునే రవి కూతురు, భార్యకు సైతం వేధింపులు తప్పడం లేదని తెలిసి పెద్ద ఎత్తున మండిపడింది.
దీనితో ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో నెగిటివ్ కామెంట్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తూ పలు వీడియోలను పోస్ట్ చేసింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో జరిగే గొడవలను చూస్తున్నా.మీరు మొదటి నుంచి 11 వారాల వరకు చూడటం లేదా? మీరు ఒకరికి అభిమాని కావచ్చు.కానీ ఆ వ్యక్తి ఒకరిని అమ్మేస్తాను అంటే కరెక్టే, అప్పడం చేస్తానంటే కూడా పెద్దగా పట్టించుకోరు.కానీ నేను డాన్స్ చేస్తే మాత్రం నన్ను చులకనగా చూస్తారు, అగౌరవ పరుస్తున్నారు అంటూ దాన్ని బాగా హైలెట్ చేస్తూ నెటిజన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరొక విషయం ఏమిటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను రవి భార్య నిత్యతో మాట్లాడాను.ఆమె కూతురు వియా వీడియోల కింద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారట.ఐదేళ్ల చిన్న పాపని ఇది కరెక్ట్ కాదు.చిన్న పిల్లల వీడియోలు మీద ఎందుకు ఇలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంత ద్వేషం.అసలు మీకు బుద్ధి లేదా? ఆ చిన్న పాప వీడియోలకు బ్యాడ్ కామెంట్స్ చేయడం ఆపండి అంటూ హెచ్చరించింది అనీ మాస్టర్.