వైరల్... ఇంత ఖరీదైన ఎద్దులను మీరు చూసి ఉండరు.. ధర ఎంతంటే?

ప్రపంచంలో ఎంతగా సాంకేతికత అభివృద్ధి చెందినా వ్యవసాయానికి ఉండే ప్రాధాన్యత వ్యవసాయానికి ఉంటుందనేది మనం కాదనలేని సత్యం.ఎందుకంటే మనిషి బ్రతకడానికి తిండి తప్పని సరి కాబట్టి అవి పండించే రైతు, వ్యవసాయం కూడా తప్పనిసరి.

 Viral You Will Never See Such Expensive Bulls What Is The Price, Viral News, Vir-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో అందరూ పెద్ద ఎత్తున ఆరు అంకెల, ఏడు అంకెల జీతం కోసం ఆరాటపడుతున్న పరిస్థితులలో వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది.వ్యవసాయాన్ని చేయడం కొందరు నామూషీగా భావిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే వ్యవసాయంలో కూడా పెద్ద ఎత్తున లాభాలు ఉంటాయంటే ఎవరూ నమ్మరు.కాని నిజంగా వ్యవసాయాన్ని ఖచ్చితంగా నమ్మినవారు మంచి లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి ఉంది.

కేవలం ఎద్దులతోనే కోటీశ్వరులు కావచ్చు అనే విషయాన్ని మీరు నమ్మలేరు.

కాని ఇది అక్షరాలా నిజం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే బెంగుళూరు వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలోని గాంధీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మేళాలో రైతులు తాము వ్యవసాయంలో పాటిస్తున్న విషయాలను ఈ ప్రదర్శనలో వచ్చిన అతిథులకు వివరించారు.సాధారణంగా రైతులు చాలా రకాల గిత్తలను వాడుతుంటారు.

ఒంగోలు గిత్త, మేలు గిత్త, హళ్లికార్ జాతి గిత్త అనే జాతులు గల గిత్తలను వినియోగిస్తూ ఉంటారు.అయితే ఈ ప్రదర్శనకు అన్ని రకాల గిత్తలు వచ్చినా ఒక హళ్లికార్ జాతి గిత్త మాత్రం ఒక్కసారిగా ప్రదర్శనకు వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రైతులు ఆ గిత్త ధర మార్కెట్ లో కోటి రూపాయలు పలుకుతుందని చెప్పడంతో ఇక ఆ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.అంతలా ఎందుకు ఈ జాతి గిత్తకు ఇంత ఖరీదు అంటే ఈ జాతి ఆవు పాలల్లో ఎ-2 ప్రోటీన్ అధికంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube