టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత విడాకుల ప్రకటన అనంతరం తన ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారు.తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు.
తాజాగా సమంత పలు పూజా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.డాక్టర్ మంజుల సమంత ఫ్రెండ్స్ లో ఒకరు కాగా మంజుల పుట్టినరోజు వేడుకలకు సమంత హాజరు కావడం గమనార్హం.
తన బెస్ట్ ఫ్రెండ్ మంజుల గురించి సమంత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.మంజుల తన జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని సమంత పేర్కొన్నారు.
కష్టాల్లో ఉన్న సమయంలోనే నిజమేన స్నేహితురాళ్లు ఎవరో తెలుస్తుందని మంజుల కంటే నిజమైన ఫ్రెండ్ తనకు ఎవ్వరూ లేరని సమంత అన్నారు.నేను మంజులను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసే ఉంటుందని సమంత మంజుల గురించి చెప్పుకొచ్చారు.
పుట్టినరోజు శుభాకాంక్షలు మంజుల అంటూ సమంత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
సమంత స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగా ఈ ఫోటోకు ఏకంగా 16 లక్షల లైక్స్ రావడం గమనార్హం.మంజుల ప్రముఖ గైనకాలజిస్ట్ లలో ఒకరు కావడం గమనార్హం.వైద్యంతో పాటు పలు రంగాలలో రాణిస్తూ మంజుల మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
సినిమా రంగానికి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలతో మంజులకు పరిచయాలు ఉన్నాయి.
విడాకుల ప్రకటన తర్వాత సమంత వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.సమంత చైతన్యతో విడిపోవడానికి కారణాలివేనంటూ అనేక వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం.సినిమాల ద్వారా కంటే వ్యక్తిగత విషయాల ద్వారానే సమంత వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.
సినిమాసినిమాకు సమంతకు క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.త్వరలో సామ్ కొత్త సినిమాల షూటింగ్ మొదలుకానుంది.