అల్లం.వంటలకు చక్కటి రుచి అందించడంతో పాటుగా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందన్న విషయం దాదాపు అందరికీ తెలుసు.
అయితే అల్లమే కాదు దాని నుంచి తీసే నూనె కూడా ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.లేత పసుపు రంగులో ఉండే అల్లం నూనె అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
అందు వల్లనే ఆరోగ్యానికి అల్లం నూనె అదిరిపోయే బెనిఫిట్స్‌ను అందిస్తుంది.మరి ఇంకెందుకు లేటు.
అసలు అల్లం నూనె ఉపయోగాలు ఏంటీ.? దాన్ని ఎలా వాడాలి.? వంటి విషయాలు తెలుసుకుందాం పదండీ.
వెయిట్ లాస్లో అల్లం నూనె ఎఫెక్టివ్‌గా హెల్త్ చేస్తుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు లేదా మూడు చుక్కల అల్లం నూనెను యాడ్ చేసుకుని సేవించాలి.ఇలా ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే గనుక.
శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్స్ మరియు అదనపు కొవ్వు తొలిగి పోతుంది.అతి ఆకలి దూరంగా అవుతుంది.
తద్వారా మీరు క్రమంగా బరువు తగ్గుతాయి.

అలాగే ఒక గిన్నెలో బాగా వేడి నీటిని తీసుకుని.అందులో నాలుగు చుక్కలు అల్లం నూనెను వేసి ఆవిరి పట్టాలి.ఇలా చేస్తే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస కోశంలో వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి.
శ్వాస ఫ్రీగా ఆడుతుంది.మరియు ఆస్తమా లక్షణాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.

ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో మూడంటే మూడు చుక్కలు అల్లం నూనె కలిపి సేవిస్తూ గనుక.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.చెడు కొలెస్ట్రాల్ కరిగి.గుండె ఆరోగ్యంగా మారుతుంది.
మరియు రోగ నిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుంది.