మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయనకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.
ఈయన ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడీ‘ సినిమా రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది.
ఈ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా‘ సినిమా చేస్తున్నాడు.ఇక వీటితో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాను చేస్తున్నాడు.
ఇంకా వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.
![Telugu Dhamaka, Rajisha, Ramarao Duty, Ravi Teja, Sarath Mandava, Sidh Sriram, T Telugu Dhamaka, Rajisha, Ramarao Duty, Ravi Teja, Sarath Mandava, Sidh Sriram, T](https://telugustop.com/wp-content/uploads/2022/04/Ramarao-On-Duty-Sarath-Mandava-Rajisha-sidh-sriram-dhamaka-tollywood.jpg)
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా రామారావు ఆన్ డ్యూటీ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు.తాజాగా ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసారు.స్టార్ సింగర్ గా వెలిగి పోతున్న సైడ్ శ్రీరామ్ ఆలపించిన బుల్ బుల్ తరంగ్ అంటూ సాగె పాటని ఈ రోజు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు.
మరోసారి సైడ్ శ్రీరామ్ తన గాత్రం తో అందరిని మాయ చేసాడు.తన వినసొంపైన గాత్రంతో సంగీత ప్రియులను తన వైపుకు తిప్పుకున్నాడు.మెలోడీ సాంగ్ ట్యూన్స్ వినసొంపుగా ఉన్నాయి.ఇటు విజువల్ గాను కూడా ఈ సాంగ్ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.
ఫస్ట్ సాంగ్ నుండే మంచి మంచి హిట్ ట్రాక్ అందించాడని తెలుస్తుంది.ప్రెసెంట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగు తున్నాయి.
![Telugu Dhamaka, Rajisha, Ramarao Duty, Ravi Teja, Sarath Mandava, Sidh Sriram, T Telugu Dhamaka, Rajisha, Ramarao Duty, Ravi Teja, Sarath Mandava, Sidh Sriram, T](https://telugustop.com/wp-content/uploads/2022/04/Ravi-Teja-Ramarao-On-Duty-Sarath-Mandava-Rajisha-sidh-sriram.jpg)
దీంతో వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే రామారావు ఆన్ డ్యూటీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.ఇందులో రవితేజ, రజిషా ఇద్దరు ఉన్నారు.రవితేజ హ్యాండ్సమ్ గా ఉండగా, రజిషా హాఫ్ శారీలో అందంగా కనిపిస్తుంది.ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.