ఒక సినిమా ను తెరకెక్కించడం ఎంత కష్టమో దాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లడం అంతకు మించిన కష్టం అంటూ చాలా మంది అంటూ ఉంటారు.పెద్ద హీరోల సినిమాలు అయినా మరే సినిమా లు అయినా కూడా ప్రమోషన్ లేకుంటే మాత్రం జనాల్లోకి వెళ్లడం కష్టంగా ఉంది.
సినిమా సక్సెస్ అయినా కూడా మంచి ప్రమోషన్ లేకుంటే వసూళ్ల విషయంలో నిరాశ తప్పలేదు గతంలో పలు సినిమాలకు.అందుకే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం ఖచ్చితంగా మంచి వసూళ్లను దక్కించుకోవాల్సిన అవసరం ఉంది.
అలాంటి వసూళ్లు మళ్లీ మళ్లీ రావాలి అంటే మంచి ప్రమోషన్ తప్పనిసరి అని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.అన్నాత్తే సినిమా దీపావళికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
సినిమా ను రజినీకాంత్ ఉన్నాడు కదా అని అభిమానులు వచ్చే అవకాశం ఉంది.కాని ఇంకా ప్రమోషన్ చేస్తే ఎక్కువ మంది వస్తారు.
అన్నాత్తే సినిమా ను హీరో హీరోయిన్ లేకుండానే ప్రమోట్ చేస్తున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్.లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన ఈ సినిమా కు వారిద్దరు లేకుండానే ప్రమోషన్ ను నెట్టుకు వస్తున్నారు.రజినీకాంత్ కు చెల్లి పాత్రలో నటించిన కీర్తి సురేష్ మరియు కీలక పాత్రలో నటించిన ఖుష్బు మరియు మీనాలు మాత్రమే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఉన్నారు.
నయతార మామూలుగానే సినిమాల ప్రమోషన్ లకు హాజరు అవ్వదు.ఇక రజినీకాంత్ కు అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల ప్రమోషన్ లో హాజరు అవ్వడం లేదు.ఈ పరిణామాలు సినిమా కు ఖచ్చితంగా నష్టం చేకూర్చుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే రజినీకాంత్ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ఆయన్ను ప్రచారంకు తీసుకు రావడం కరెక్ట్ కాదు అనేది కొందరి మాట.అదే విషయాన్ని నిర్మాతలు పాటించి ఆయన్ను తీసుకు వచ్చే సాహసం చేయడం లేదు అంటున్నారు.