సుమ సినిమా రీ ఎంట్రీ.. నిజం ఏంటో తేలిపోయింది

తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు సుమ అనే పేరును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పెద్ద ఎత్తున ఆమె షో లు టీవీల్లో వస్తూనే ఉన్నాయి.

టీవీ పెడితే చాలు ఏదో ఒక ఛానెల్‌ లో ఆమె సందడి కనిపిస్తూ ఉంటుంది.ఇక పెద్ద హీరోల సినిమాల వేడుకలు ఉంటే ఖచ్చితంగా సుమ యాంకరింగ్ చేయాల్సిందే.

సుమ లేకుంటే మరే హోస్ట్ తో చేయించినా కూడా ఆ కార్యక్రమం పెద్దది అవ్వదు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయంగా మారింది.అంతలా సుమ పేరు దక్కించుకున్నారు.

సుమ చాలా కాలం నుండి బుల్లి తెరకు పరిమితమై ఉన్నారు.గతంలో సుమ వెండి తెరపై కూడా సినిమాలు చేసిన విషయం చాలా మందికి తెల్సిందే.

Advertisement

బుల్లి తెరపై బిజీ అవ్వడం వల్ల వెండి తెరను ఆమె దూరం పెట్టారు.అప్పుడప్పుడు మెరిసినా కూడా ఆమె పూర్తి స్థాయిలో మాత్రం వెండి తెరపై కనిపించలేదు.

ఎట్టకేలకు మళ్లీ సుమ వెండి తెరపై కనిపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది.చాలా మంది అడిగినట్లుగా.

కోరుకున్నట్లుగా ఖచ్చితంగా నేను సినిమా ల్లో నటించాలని అనుకున్నాను.అది ఎప్పుడు ఏంటీ అనేది త్వరలో మీ ముందుకు తీసుకు వస్తాను అంటూ ఒక ఫన్నీ వీడియో ద్వారా తన రీ ఎంట్రీ గురించి విషయాన్ని తెలియజేసింది.

సుమ ఏ సినిమా లో నటించబోతుంది.ఎవరితో నటించబోతుంది.ఎలా నటించబోతుంది అనే విషయాలను త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

సుమ హీరోయిన్‌ గా సెట్‌ అవ్వదు.అలా అని హీరోలకు అమ్మ పాత్రలు చేస్తుందని అనుకోవడం లేదు.

Advertisement

కనుక ఖచ్చితంగా ఒక మంచి లేడీ ఓరియంటెడ్‌ సినిమా ను ఆమె చేస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.సుమ ఏం చేసినా కూడా సంచలనం గా ఉండటం ఖాయం.

కనుక సినిమా ఎంట్రీ తో సుమ మళ్లీ రెచ్చి పోవడం ఖాయం అంటున్నారు.

తాజా వార్తలు