సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు తమ వ్యక్తిగత జీవితం కూడా సినిమా లాగానే అనుకుంటారు.ఒక సినిమాలో నటించినంత వరకే ఆ పాత్ర ముగుస్తుంది.
ఆ తర్వాత మళ్లీ మరొక సినిమాలో అడుగు పెడతారు.ఇలా ఒకటి ముగియడంతో మరొక దాంట్లో అడుగు పెడుతుంటారు.
అలా తమ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒక జీవితంలోకి అడుగు పెట్టాక అది నచ్చక పోవడంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.
ఇంతకు అది ఏ విషయంలోనో ఈ పాటికే మీకు అర్థం కావచ్చు.
ఇంకేంటి ప్రేమ, పెళ్లి విషయమే. నిజానికి ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు ప్రేమ, పెళ్లి అనే విలువ అసలు తెలియదేమో కానీ నచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటారు.
నచ్చకపోతే వదిలేస్తారు.నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తారు నచ్చకపోతే ద్వేషిస్తారు.
ఇప్పటికి అలా ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లే చేశారు.పైగా పిల్లలు పుట్టాక కూడా విడాకులు తీసుకొని మరొక పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ఇటువంటివి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచిన సమంత, నాగ చైతన్య ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే.
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులను చూసి ఎంతోమంది మురిసిపోయారు.ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనేలా చేశారు.
కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇద్దరు విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించే సరికి అందరూ ఒకేసారి షాక్ అయ్యారు.ఇప్పటికీ కూడా వీరి విడాకుల విషయం నుండి అభిమానులు తేరుకోలేక పోతున్నారు.
ఇక పూర్తిగా వీరి విడాకుల విషయాన్ని మరిచిపోకముందే మరో జంట విడాకులు తీసుకున్నట్లు తాజాగా నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక వీరు కూడా సామ్, చైతూ బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం వీరి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆ హీరో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ తో వరుస సినిమాలతో బాగా బిజీ అయ్యాడు.కెరీర్ మొదట్లో మంచి సక్సెస్ లు లేకపోయేసరికి ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డ ఆ హీరోకి ఈమధ్య రీ ఎంట్రీ తో మంచి అవకాశాలు వచ్చాయి.
పైగా వరుస సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు.కానీ ఇదే సమయంలో తన భార్య తనకు మనస్పర్ధలు కారణంగా కొన్ని విభేదాలు వచ్చాయని తెలిసింది.
చిన్న చిన్న గొడవలు పెద్దగా అవుతున్నాయని దీనివల్ల తమ కెరీర్ ఏం అవుతుందో అన్న భయంతోనే విడాకులు తీసుకున్నట్లు టాక్ వినిపించింది.పైగా ఈ విషయం గురించి ఆ టాలీవుడ్ జంట త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంతకు ఆ జంట ఎవరు అనేది మాత్రం బయట పడలేదు.