ఏపీ ఎంపీలపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

నిన్న విశాఖపట్టణం కూర్మన్నపాలెం లో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణం వైసిపి పార్టీ ఎంపీలే అని మండిపడ్డారు.ఏపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.

అందువల్లే కేంద్రాన్ని గట్టిగా పోరాడలేక పోతున్నారు అని మండిపడ్డారు.నిజంగా వైసీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని.

వారం లో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు.ఎంతో మంది బలిదానాలు చేస్తే విశాఖ ఉక్కు కర్మాగారం సహకారం అయిందని దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

Advertisement

ఢిల్లీలో తనకి కేంద్రం విలువ ఇస్తుంది అంటే కారణం ప్రజాబలం ఉండబట్టే అని తెలియజేశారు.ఒక్క ఎంపీ లేకపోయినా ఉన్న ఒక్క ఎమ్మెల్యే ని.అధికార పార్టీ వైసీపీ తీసుకెళ్ళి పోయిన.తనకి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యత.సెంటిమెంట్ విషయాల గురించి తాను చెప్పిన అంశాలు సావధానంగా అమిత్ షా విన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి జరుగుతున్న అన్యాయం విషయంలో అన్ని పార్టీలు కలిస్తేనే.సరైన న్యాయం జరుగుతుందని పవన్ స్పష్టం చేశారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు