సినిమా ఇండస్ట్రీలో పలు ఐటమ్ సాంగులతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శృంగార తారగా ఎంతో పేరు సంపాదించుకున్న సన్నీలియోన్ కేవలం బాలీవుడ్ చిత్రాలకు మాత్రమే కాకుండా తెలుగు చిత్రాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటారు.
తాజాగా ఈమె తన ముంబైలో తన ఇంటికి సంబంధించిన ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే సన్నీ లియోన్ స్పందిస్తూ ముంబైలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపే సరదా క్షణాలు స్వర్గాన్ని మా ఇంట్లో కలిగి ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
అంటూ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.ఇకపోతే సన్నీలియోన్ హిందీ,తెలుగు, తమిళ చిత్రాల్లో ఐటం సాంగులలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇక ఈమె ముంబైలో తన భర్త పిల్లలతో కలిసి నివసిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తన ఇంటిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.