టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ‘గీతా గోవిందం’ దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
కాగా ఈ సినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలోనే త్రివిక్రమ్‌తో మహేష్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించడంతో, ఇప్పుడు ఈ సినిమానే ముందుగా తెరకెక్కించనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.‘సర్కారు వారి పాట’తో సరిసమానంగా త్రివిక్రమ్ మూవీలో కూడా నటించాలని మహేష్ భావించాడట.
కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ప్లాన్ వర్కవుట్ కాలేదు.దీంతో సర్కారు వారి పాట ముగిశాక, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మూవీని తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాను వేగంగా పట్టాలెక్కించి, అంతే వేగంగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఈ సినిమా తరువాత జక్కన్నతో సినిమాను చేసేందుకు మహేష్ పెద్ద మొత్తంలో డేట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
అటు రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చూస్తున్నాడట.దీంతో మహేష్ చిత్రం కోసం ఆయన స్క్రిప్టును రెడీ చేసేందుకు మరింత సమయం పడుతుందని, ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్ చిత్రాన్ని పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి మహేష్ నెక్ట్స్ మూవీ జక్కన్నతో కాకుండా త్రివిక్రమ్‌తో ఉండబోతుందనే విషయానికి ఈ వార్త మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పాలి.