పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి సినిమా “భీమ్లా నాయక్” .
ఈ సినిమాను మలయాళంలో బిజు మీనన్ -పృథ్వి రాజ్ ఇద్దరు పోటీ పడుతూ నువ్వానేనా అన్నట్టుగా నటించారు.ఈ క్రమంలోనే తెలుగులో కూడా రానా – పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే హైలెట్ చేసి చూపిస్తున్నారు.
ఇందులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం వల్ల టైటిల్ కూడా అదే ఖరారు చేశారు.
ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ పోస్టర్లను, టీజర్, టైటిల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో ఎక్కడా కూడా రానాను చూపించకపోవడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో రానా పాత్ర కూడా ఎంతో కీలకమైనదని,ఆయన కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అయినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర హైలెట్ చేయడంతో రానాకి పూర్తిగా అన్యాయం చేసినట్లేనని తన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లా నాయక్ గా పవన్ టీజర్ రిలీజ్ చేసాక స్పెషల్ గా రానా టీజర్ ఉంటుంది అన్నప్పటికీ ఈ విషయంపై మేకర్స్ ఏ విధంగానూ స్పందించలేదు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పవర్ స్టార్ గన్ పట్టుకొని బైక్ పై ఉన్నటువంటి భీమ్లా నాయక్ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు మాత్రమే అంత ప్రత్యేకత ఇవ్వడానికి కారణం ఆయన భీమ్లా నాయక్ పాత్రలో నటించడం వల్ల ఆయనకు అంత ప్రత్యేకత ఇస్తూ రానాకు అన్యాయం చేస్తున్నారని ఆయన అభిమానులు హర్ట్ అవుతున్నారు.