వైరల్ పిక్‌.. కాబూల్‌ను విడిచి విమానం ఎక్కుతున్న అమెరికా చివ‌రి సైనికుడు

ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో జ‌రుగుతున్న దారుణాలు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్నాయ‌నే చెప్పాలి.కాగా ఇంత జ‌రుగుతున్నా కూడా అక్క‌డ మాత్రం క‌నీసం పోరాట ప‌ఠిమ క‌నిపించ‌ట్లేదు.

 Viral Pic The Last American Soldier To Board A Plane Leaving Kabul, Viral Pic, K-TeluguStop.com

అస‌లు ఇదంతా జ‌ర‌గ‌డానికి కార‌ణం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అమెరికా త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కు ర‌ప్పించుకోవ‌డ‌మ‌నే చెప్పాలి.గ‌త 20 ఏండ్లుగా జ‌రిగిన యుద్ధాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా పోరు ముగించుకుంది.

మొన్న‌టి వ‌ర‌కు త‌మ ఆధిప‌త్యంలోనే ప్ర‌భుత్వాన్ని కొన‌సాగించిన అమెరికా ఇప్పుడు త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కు ర‌ప్పించ‌డంలో మునిగిపోయింది.

దీంతో ఇప్పుడు ఆ దేశం నుంచి త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కు ర‌ప్పిస్తూ మూటా ముల్లె సర్దేసింది అమెరికా.

తాము విధంచిన గడువు కంటే కూడా ఒక్కరోజు ముందే అమెరికా ఆ దేశాన్ని విడిచింద‌నే చెప్పాలి.చివరి విడతలో భాగంగా మిగిలిపోయిన సైనికులను అమెరికా యుద్ధవిమానాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

దీంతో ఇప్పుడు ఆ దేశంలో తాలిబాన్ల రాక్షస పాలనకు అడ్డు అదుపు లేకుండా డా పోయాయి.కాగా ఈ విధంగా అమెరికా సైనిక బలగాలు ఆఫ్ఘ‌నిస్తాన్ ను విడిచి వెళ్తున్న స‌మ‌యంల‌లో కెమెరాల‌కు ఓ ఫొటో చిక్కింది.

ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతంఓది.అయితే అత‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ వీడుతున్న అమెరికా సైనికుడు.

ఆయ‌న చీకట్లో నడుస్తూ విమానం ఎక్కేందుకు వ‌స్తున్న క్ర‌మంలో ఆయ‌న ఫొటోను అక్క‌డున్న వారు తీయ‌డంతో అది వైర‌ల్ అవుతోంది.ఎందుకంటే ఆయ‌న మేజర్ జనరల్ క్రిస్ డోనాహు.

ఇప్పుడు ఆయ‌న ఆఫ్ఘ‌నిస్తాన్‌ను వీడిన సైన్యంలో చిట్ట చివ‌రి వ్య‌క్తి కావ‌డం విశేషం.ఆఫ్ఘాన్ ను వీడిన చివ‌రి అమెరిఆ సైనికుడిగా ఆయ‌న చ‌రిత్ర‌లో నిలిచిపోనున్నారు.

ఇప్పుడు ఆయ‌న ఫొటో విప‌రీతంగా వైర‌ల్ కావ‌డం గ‌మనార్హం.మ‌రి మీరు కూడా ఆ సైనికుడి ఫొటోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube