బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా గురించి అందరికి తెలిసిందే.బోల్డ్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన మాటలతో, ఆటలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది.మొత్తానికి బిగ్ బాస్ లో తన పరిచయాన్ని బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ఇక అందులో మరో కంటెస్టెంట్ అవినాష్ తో కలిసి బాగా రచ్చ చేసింది.ఇదిలా ఉంటే తాజాగా అవినాష్ అరియానా పై దారుణమైన కామెంట్స్ చేశాడు.
కెరీర్ మొదట్లో యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేస్తూ ఉండే అరియానా.ఓసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.వర్మ చేసిన బోల్డ్ కామెంట్స్ తోనే తన కెరీర్ మొత్తం మలుపు తిరిగింది.ఆ కారణంగానే బిగ్ బాస్ షోలో అవకాశాన్ని అందుకుంది.
బిగ్ బాస్ తర్వాత పలు ప్రాజెక్టులలో, షో లలో అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
యూట్యూబ్ లో యాంకరింగ్ చేస్తూనే.
షార్ట్ ఫిలిమ్స్ లో కూడా బాగా బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలను, తన ఫోటోలను బాగా పంచుకుంటుంది.
ఇక మరో బుల్లితెర ఆర్టిస్ట్ ముక్కు అవినాష్ తో మంచి స్నేహాన్ని సొంతం చేసుకుంది.ఇక వీరిద్దరి స్టార్ మాలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ లో పాల్గొని బాగా రచ్చ చేశారు.
తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో అవినాష్.అరియానా ఇటీవలే వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ గురించి దారుణంగా కామెంట్స్ చేశాడు.
ఇక వీరి స్కిట్ అనంతరం.కొన్ని గొడవల మధ్య వీరిద్దరూ విడిపోయారట.అసలేం జరిగింది అని శ్రీముఖి ప్రశ్నించింది.వెంటనే అరియానా స్పందిస్తూ.అసలు గొడవ ఎందుకు అయిందో అర్థం కాలేదు.ఇక తర్వాతకి మాట్లాడొద్దు అనే సరికి చాలా బాధనిపించింది అని తెలిపింది.
ఇక అవినాష్ మాట్లాడుతూ.ఫ్రెండ్ తప్పుదారిలో వెళ్తుంటే రాంగ్ వే.అంటూ తనకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అని అలా వెళ్ళకని చెప్పాడట.ఆమె తన మాట వినలేదు అంటూ.
మాట్లాడటం మానేశాక తనే వచ్చి సారీ చెప్పింది అంటూ తెలిపాడు.