టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ప్రస్తుతం విలన్ పాత్రలపై హీరో శ్రీకాంత్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ సినిమాలో నటించడంతో పాటు ప్రస్తుతం పెళ్లి సందడి సినిమాలో నటిస్తున్నారు.
శ్రీకాంత్ కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినీ హీరోల వారసుల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే హీరోల కొడుకులు సక్సెస్ అయిన స్థాయిలో హీరోల కూతుళ్లు మాత్రం సక్సెస్ కావడం లేదు.నిహారిక, శివాత్మిక, మంచు లక్ష్మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
అయితే శ్రీకాంత్ కూతురు మేధ కూడా సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం మేధ వయస్సు 17 సంవత్సరాలు కాగా మేధ ఎంట్రీ ఇస్తున్నట్టు వస్తున్న వార్తల విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం మేధ సినిమా ఎంట్రీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుండగా మేధ ఇప్పటికే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం కూతురు ఎంట్రీని దృష్టిలో పెట్టుకుని శ్రీకాంత్ మంచి కథలను ఎంపిక చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.
అయితే శ్రీకాంత్ కూతురు ఎలాంటి కథతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.కూతురు ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని శ్రీకాంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాంత్ కూతురు ఎంట్రీ కోసం శ్రీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.మరి శ్రీకాంత్ అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.శ్రీకాంత్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.అఖండ మూవీ సక్సెస్ సాధిస్తే శ్రీకాంత్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరే అవకాశం ఉంది.