వైరల్‌..ముప్పై ఏళ్లుగా ఒకే లాటరీ టిక్కెట్‌ కొంటున్న వ్యక్తి.. చివరకు ఏమైందంటే..!

కొన్ని విషయాలు మనం నమ్మశక్యం కావు.ఇక పూర్తిగా అదృష్టం దేవుడిపై భారం వేసే విషయాలైతే మరింత ఊహకు అందవు.

 Viral Man Buys Lottery Ticket With Same Numbers For 30 Years, America, Lottery T-TeluguStop.com

అలాంటి ఘటనే నిజ జీవితంలో జరిగింది.యూనైటెడ్‌ స్టేట్స్‌కు చెందిన ఓ వ్యక్తి దాదాపు మూప్పై ఏళ్లుగా ఒకే నంబర్‌ లాటరీ టిక్కెట్‌ కొంటున్నాడు.

కానీ, చివరకు అతని అదృష్టం పండిందా? లేదా? ఆ వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా లాటరీని గెలవాలంటే పూర్తిగా అది మన అదృష్టం పై ఆధారపడి ఉంటుంది.

అమెరికాలో ప్రతిరోజూ ఎన్నో లాటరీ టిక్కెట్లను ప్రింట్‌ చేస్తూనే ఉంటారు.విక్రయిస్తూనే ఉంటారు.

అయితే, కొన్ని దశాబ్దాలుగా ఓపిగ్గా లాటరీ కోసం ఎదురు చూసిన ఓ వ్యక్తికి జాక్‌పాట్‌ తగిలింది.ఆ వ్యక్తికి అదృష్టం ఇప్పటికి తలుపు తట్టింది.దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయింది.యూఎస్‌కు చెఇందిన వ్యక్తి లాటరీ విన్‌ అయి మిలియనీర్‌ అవ్వడంతో ప్రస్తుతం ఈ వార్త వైరల్‌ అవుతోంది.ఈ వ్యక్తి గడిచిన మూప్పైఏళ్లుగా అంటే 1991 నుంచి ఒకే నంబర్‌ సెట్‌ కలిగిన లాటరీ టిక్కెట్‌ను కొంటూ వస్తున్నాడు.కానీ, లాటరీ అనేది పూర్తిగా మన అదృష్టంపై ఆధారపడి ఉండేది కదా! దీన్ని మార్చడానికి వీలుండదు.

కానీ, 30 ఏళ్ల అతని సహనం, కాదు మొండితనంతో ఒకే నంబర్‌ సెట్‌ కలిగిన లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తూనే ఉన్నాడు.ఎందుకంటే అతడు కచ్చితంగా మిలియనీర్‌ అవుతాననే నమ్మకం అలా చేయించింది.

61 ఏళ్ల వ్యక్తి మిచిగాన్‌ వాసి.అతగాడి పేరు ఇంకా మీడియాలో వెల్లడి కాలేదు.

Telugu Dollars Lottery, America, Lottery Ticket, Michigan, Lottery Number-Latest

లాటరీ సంఖ్యను ప్రకటించినపుడు అతడు మాట్లాడుతూ తన 30 ఏళ్ల సహనం ఫలించిందని అన్నాడు.తాను 1991 నుంచి ఒకే సెట్‌ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశానని, కానీ, ఇప్పటి వరకు విజయం వరించలేదని అన్నాడు.ఎన్నోమార్లు లాటరీ నంబర్‌ను మారుద్దామని అనుకున్నా.మార్చకుండా మొండిగా ఉండిపోయానన్నాడు.తాను దశాబ్దాలుగా కొంటున్న లాటరీ నంబర్‌ ఇంత భారీ మొత్తం గెలిచిందనడంతో నమ్మలేకపోయానని ఆయన అన్నారు.అతను 18.41 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.1,36,48,77,818.మొత్తం లాటరీ 18 మిలియన్‌ డాలర్లలో అతను 11.7 మిలియన్‌ డాలర్లను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.తన కుటుంబానికి కొంత ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని ఆదా చేసుకుని, అందులో మరికొంత స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube