ఆఫ్ఘన్‌లోని సిక్కులు, హిందువుల తరలింపు: వైట్‌హౌస్‌ సాయం కోరిన అమెరికా సిక్కు సంఘాలు

తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం హృదయ విదారకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.అధికారాన్ని అందుకోక ముందే.

 Us Sikhs Seek White House Intervention In Evacuation Of Afghanistan Sikhs, Hindu-TeluguStop.com

జనంపై తాలిబన్లు ఆంక్షలు విధిస్తున్నారు.ఇప్పటికే పాఠశాలల్లో కో ఎడ్యుకేషన్ నిషేధించిన తాలిబన్లు, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు.

వీటిని కాదంటే ఏం జరుగుతుందో ఆఫ్ఘన్లకు తెలుసు.మరోవైపు 20 ఏళ్ల నాటి పరిస్ధితులను గుర్తుకు తెచ్చుకుని వణికిపోతున్న ఆఫ్ఘన్లు.

కట్టుబట్టలు, పిల్లాపాపలతో దేశం విడిచి వెళ్లేందుకు ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది.తాలిబన్లను దాటుకుని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విమానాశ్రయానికి చేరుకుంటే ఇక్కడ ఐసిస్ మూకలు ప్రాణాలు తీసేస్తుండటంతో ఆఫ్ఘన్లు బిక్కుబిక్కుమంటున్నారు.

విదేశీయుల తరలింపులకు ఆగస్టు 31 వరకు మాత్రమే సమయం వుండటంతో ఆయా దేశాలు సైతం ఏర్పాట్లు చేస్తున్నాయి.మనదేశం సైతం పలు విడతలుగా ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులతో పాటు పలువురు స్థానికులను సైతం క్షేమంగా ఢిల్లీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే కాబూల్‌లోని గురుద్వారాలో వందల మంది హిందువులు, సిక్కులు వున్నట్లుగా తెలుస్తోంది.వీరి తరలింపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలో వీరి తరలింపుపై సాయం చేయాల్సిందిగా అమెరికాలోని సిక్కు సంఘాలు వైట్ హౌస్ ప్రతినిధులను కోరుతున్నాయి.దీనిలో భాగంగా నేషనల్ సిక్కు క్యాంపెయిన్ (ఎన్ఎస్‌సీ) సహ వ్యవస్ధాపకుడు డాక్టర్ రాజ్‌వంత్ సింగ్, మరో నేత గుర్విన్ సింగ్ అహుజా‌లు ఆఫ్ఘన్‌లోని సిక్కు, హిందువుల తరలింపుకు సంబంధించిన సమస్యలపై వైట్ హౌస్‌ అధికారులకు వివరించారు.

ఒకవేళ సిక్కులు, హిందువులను అమెరికాకు తరలించినట్లయ్యితే. బైడెన్ యంత్రాంగానికి సిక్కు సంఘం సాయంగా వుంటుందని వారు తెలియజేశారు.

ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదటి బ్యాచ్ సిక్కులు, హిందువులను క్షేమంగా తరలించినందుకు గాను వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే కాబూల్ విమానాశ్రయం వెలుపల సిక్కులు, హిందువులను తరలించడానికి అమెరికా దళాలు సహాయ పడాలని వారు కోరారు.

అటు కెనడా ప్రభుత్వం సైతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి సిక్కు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించిందని వైట్‌హౌస్ అధికారులకు వారు గుర్తుచేశారు.

Telugu Afghanistan, Biden, Hindus, Kabul Airport, National Sikh, Sikh America, T

కాగా, గురువారం నాటి కాబూల్ ఎయిర్‌పోర్ట్ ఉగ్రదాడి నుంచి 160 మంది సిక్కులు, హిందూ పౌరులు తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే.వీరంతా గురుద్వారాలో ఆశ్రయం పొందడంతో.ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ జంట పేలుళ్లు జరగడానికి కొద్ది గంటల ముందు వరకు దాదాపు 145 మంది ఆప్గన్ సిక్కులు, 15 మంది హిందువులు అక్కడే ఉన్నారు.గత వారం ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే.

దీంతో.వీరంతా.

దేశం విడిచిపెట్టారు.లేకపోతే.

ఈ బాంబు దాడిలో వీరు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube