పురుషుల్లో హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసే బెస్ట్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!

స్త్రీలే కాదు ఎందరో పురుషులు సైతం హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, కాలుష్యం, కంటి నిండా నిద్ర లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి‌.

 This Is The Best Remedy To Control Hair Fall In Men! Best Remedy, Home Remedy, H-TeluguStop.com

ఏదేమైనా జుట్టు రాలే కొద్ది పురుషుల్లో టైసన్ పెరిగిపోతూ ఉంటుంది.ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని బెంగ పెట్టుకుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వ‌ర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో మీ జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం.ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందు రెండు ఎగ్స్( Eggs ) తీసుకుని బ్రేక్ చేసి వాటిలో ఉండే పచ్చ సొన ని సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డు పచ్చ సొన వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( curd ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి వేసి మరోసారి అన్నీ కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న పురుషులు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ రెమెడీని పాటించాలి.తద్వారా కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు త్వరగా తెల్లబడకుండా కూడా ఉంటుంది.కాబట్టి జుట్టు రాలిపోతుందని సతమతం అవుతున్న పురుషులు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube