Naga Chaitanya : నాగచైతన్యను బాగా తిడుతున్న నెటిజన్స్.. ఒక తెలుగు హీరోవై ఉండి ఇలా ప్రవర్తిస్తావా అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాత, తండ్రి హోదాలతో అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న నాగచైతన్య ( Naga Chaitanya )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న సినిమాతో హీరోగా అడుగుపెట్టగా ఇప్పటివరకు స్టార్ హీరో కాలేకపోయాడు.

 Netizens Scolding Naga Chaitanya A Lot-TeluguStop.com

కానీ వ్యక్తిగత విషయంగా మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.

నాగచైతన్య 2009లో జోష్ సినిమా( Josh movie ) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.తొలి నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాగచైతన్య.ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టగా అక్కడ ఓ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు.ఇక 2017లో ఏ మాయ చేసావే సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో తన మాజీ భార్య సమంత( Samantha ) కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత 100% లవ్, దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా పలు సినిమాలలో నటించగా చాలా వరకు మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక కొన్ని సినిమాలు మాత్రం చాలా తక్కువగా గుర్తింపుని ఇచ్చాయి.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో నాగచైతన్య.సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి తర్వాత కూడా ఇద్దరు పలు సినిమాలలో నటించారు.టాలీవుడ్ లో ఈ జంట చూడముచ్చటగా కనిపించింది.

కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడాకుల పేరుతో షాక్ ఇచ్చారు.విడాకుల తర్వాత ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బతుకుతున్నారు.

ఇక గత కొన్ని రోజుల నుండి నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో( Sobhita Dhulipalla ) రిలేషన్ షిప్ లో ఉన్నాడని జోరుగా వార్తలైతే వస్తున్నాయి.ఇదేకాకుండా ఇద్దరు కలిసి ఉన్న సందర్భాలు కూడా బాగా కనిపించాయి.దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుంది అని అందరూ అనుకుంటున్నారు.ఇక నాగచైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.

అప్పుడప్పుడు ఆయన పెట్టే పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇదంతా పక్కన పెడితే ఆయన ప్రస్తుతం కస్టడీ సినిమా( Custody movie )లో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.దీంతో రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నాడు.అయితే తాజాగా ప్రమోషన్స్ భాగంలో తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకున్నాడు.

ఇక అందులో తను ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ మెను కు సంబంధించి ఒక గేమ్ ఆడగా.తన సినిమా రిలీజ్ కాబోతుంది అని గుర్తుకు చేశాడు.అయితే ఆయన ఎక్కడ కూడా తెలుగులో మాట్లాడినట్లు కనిపించలేదు.మొత్తం ఇంగ్లీష్ భాషనే వాడాడు.దీంతో ఆ వీడియో చూసి చాలామంది ఫైర్ అవుతున్నారు.ఒక తెలుగు హీరోవై ఉండి తెలుగులో మాట్లాడటానికి ఏం పోయేకాలం.

మరి ఇంత ఓవర్ చేయొద్దు.సమంతతో విడిపోయిన తర్వాత బాగా మార్పు వచ్చింది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube