1.వాట్సాప్ పై కేసు పెట్టిన రష్యా

తమ దేశ పర్సనల్ డేటా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలపై వాట్సప్ సంస్థపై కేసు నమోదైంది.
2.చోరీ అయిన కళా ఖండాలు భారత్ కు అప్పగింత
12వ శతాబ్దం లో చోరీకి గురైనట్లు గా, అక్రమంగా చేతులు మారినట్లుగా భావిస్తున్న 14 కళాఖండాలను భారత్ కు ఆస్ట్రేలియా అప్పగించనుంది.
3.టర్కీ అడవిలో దానావాలం
టర్కీ లోని అడవిలో కార్చిచ్చు రగిలింది.పెద్ద సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.ఈ ఘటనలో దాదాపు నలుగురు మరణించగా, 60 మంది ఆసుపత్రి పాలయ్యారు.దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
4.కరోనాపై డబ్ల్యుహెచ్ఓ వార్నింగ్
కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమై పోయిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వార్నింగ్ ఇచ్చింది.మళ్లీ కరుణ కళ్ళను సృష్టించబోతోంది అని గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది కొత్త కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యారని డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ అదనమ్ గెబ్రియేసస్ హెచ్చరించారు.
5.అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్ గా ఇండో అమెరికన్

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మరో భారతీయుడుకి కీలక పదవి కట్టబెట్టారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్ గా భారతీయ అమెరికన్ రషీద్ హుస్సేన్ ను నియమించారు.
6.హెచ్1 బి వీసా కోసం రెండోసారి లాటరీ

హెచ్ వన్ బి వ్యవసాయం పుకులో అవకాశం దొరకని వారికి మరో అవకాశం కల్పించేందుకు అమెరికా నిర్ణయించుకుంది.ఈ ఏడాది రెండో సారి లాటరీ తీయనున్నట్టు యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గురువారం వెల్లడించింది.
7.136 దేశాల్లో డెల్టా వేరియంట్
డెల్టా వేరియంట్ 132 దేశాల్లోకి ప్రవేశించిందని, భారత్ లో ఈ వేరియెంట్ తొలిసారిగా కనిపించిందని, ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తోంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
8.అంతర్జాతీయ విమానాలు రద్దు పొడగింపు

భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న క్రమంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కేంద్రం ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు పౌరవిమానయాన నియంత్రణ సంస్థ డిజీసిఏ ప్రకటించింది.
9.అబుదాబిలో సత్తాచాటిన ఇండియన్ స్కూల్స్
తాజాగా విడుదలైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సి బి ఎస్ ఈ ) గ్రేడ్ -12 పరీక్ష ఫలితాల్లో అబుదాబీ లోని ఇండియన్ స్కూల్స్ సత్తా చాటాయి.
గ్రేడ్ -12 లో మొత్తం 38 మంది విద్యార్థులు ఉంటే అందరూ ఉత్తీర్ణత సాధించారు.వీరిలో ఐదుగురు 95 శాతం, పదిమంది 90 శాతానికి పైగాా మార్కులు సాధించారు.
10.భారత్ వయాగ్రా… యూఎస్ లో సీజ్

అమెరికా కస్టమ్స్ అధికారులు శుక్రవారం సుమారు 5.30 కోట్లు విలువచేసే 23 వేలకు పైగా సిల్డెనాఫీల్ సిట్రెట్ పిల్స్ ను సీజ్ చేశారు.ఈ డ్రగ్స్ న్యూ ప్రధానంగా వయాగ్రా తయారీలో వాడతారు.
భారత్ నుంచి వచ్చిన ఈ పిల్స్ ను జార్జియాలోని డేకాటర్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్ కు తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.