టీపీసీసీ ఇన్ చార్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కదనరంగంలోకి అడుగు పెట్టారు.వస్తూనే తన నియామకాన్ని వ్యతిరేఖించిన వారిని కూడా కలుపుకుపోతున్నారు.
వరుస కార్యక్రమాలను ప్రకటించి రాష్ర్ట వ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. ఈ నెల 12 పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా.
ఎడ్లబండ్లు, సైకిళ్లతో ర్యాలీలు చేపట్టనున్నారు.అంతే కాకుండా ఈ నెల 16వ తేదీన చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఇవి మాత్రమే కాకుండా నిరుద్యోగుల సమస్యలపై 48 గంటల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నారు.అలాగే కరోనా కేసులల్లో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పించిందనే విషయాన్ని గ్రామస్థాయి నుంచి లెక్కలు తీసి నిజనిర్ధారణ చేయాలని చూస్తున్నారు.
ఇలా పక్కా పకడ్బందీ ప్రణాళికలతో రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు.కాంగ్రెస్ కు రాష్ర్టంలో పూర్వ వైభవం తీసుకువస్తానని ప్రకటించారు.దీంతో రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో తేలుతున్నారు.అంతే కాకుండా ఈ నెల 12 నిర్వహించే కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో విజయవంతం చేసేలా జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులకు పలు సూచనలు జారీ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టాలని సూచించారు.అంతే కాకుండా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.

ఇలా ఒకే సారి కేంద్ర ప్రభుత్వంపై, రాష్ర్ట ప్రభుత్వం పై దాడి చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఇక రేవంత్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చిందని వారే చెబుతున్నారు.ఇన్నాళ్లకు టీఆర్ఎస్ అక్రమాలను ప్రశ్నించకుండా నిశబ్ధంగా ఉన్నామని కానీ ఇప్పుడు తమ నాయకుడి ఆధ్వర్యంలో అధికార టీఆర్ఎస్ పై పోరాటాలు చేస్తామని చెబుతున్నారు.మరి ఈ పోరాటాలు టీఆర్ ఎస్‌ను ఎంత వరకు ఇరుకున పెడుతాయో వేచి చూడాల్సిందే.