ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో చూస్తూనే ఉన్నాం.ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు.
ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటున్నారు.ఇదిలా ఉంటే సెలబ్రేటిలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.
ఎప్పటికప్పుడు తమ ఫోటో షూట్ లు చేయించుకుంటూ తమ ఫాలోవర్స్ తో తెగ షేర్ చేసుకుంటారు.ఇదిలా ఉంటే ఈమధ్య హీరోల వైఫ్ లు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.
ఏకంగా ఓ స్టార్ హీరో వైఫ్ అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకొని హీరోయిన్స్ ని మించి సెలబ్రిటీగా మారింది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.
టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి.అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.పైగా అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానులకు బాగా దగ్గరగా ఉంటారు.ఇక బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా అభిమానులకు బాగా దగ్గరగా ఉంటుంది.
సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది.ఎప్పటికప్పుడు తన పిల్లల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.
అంతేకాకుండా బన్నీ కి సంబంధించిన విషయాలు కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక తాము కలిసి ట్రిప్స్ కి వెళ్లిన పిక్స్ లను, బన్నీ తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోన్ లో బంధించి అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్ డేట్ చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో స్నేహ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఏకంగా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.
పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకొని స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది బన్నీ వైఫ్.మొత్తానికి సోషల్ మీడియాలో సెలబ్రిటీ గా మారింది స్నేహ రెడ్డి.