కరోనా కారణంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిందే లేదు.ఎన్నో సినిమా లు బాక్సాఫీస్ వద్దకు రావాల్సి ఉన్నా కూడా రాలేదు.
ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమాలు విడుదల కాలేదు.కాని గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద సినిమా లు మాత్రం గత ఏడాది కాలంగా ప్రకటించారు.
పెద్ద ఎత్తున సినిమా లు పట్టాలెక్కడంతో పాటు ఎన్నో సినిమా లు ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు.ముఖ్యంగా తెలుగులో ప్రభాస్ నుండి మొదలుకుని చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు ప్రకటించారు.
ఇంతకు ముందు రాజమౌళి మాత్రమే వంద కోట్లకు మించిన బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వచ్చాడు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.
ఎంతో మంది స్టార్స్ కూడా వంద కోట్లు అంతకు మించి అన్నట్లుగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.
ముఖ్యంగా గత ఏడాది కాలంగా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఏకంగా మూడు వేల కోట్ల విలువ చేసే భారీ ప్రాజెక్ట్‌ల ను ప్రకటించారు.
ఈ ఏడాదే తమిళ సూపర్ స్టార్ విజయ్ ను తెలుగు కు తీసుకు వచ్చేందుకు దిల్ రాజు సిద్దం అయ్యాడు.
అలాగే సలార్ సినిమా ను ప్రశాంత్ నీల్ చేస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.ప్రశాంత్ నీల్ త్వరలో ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు.ఆ ప్రాజెక్ట్ కూడా అధికారిక ప్రకటన వచ్చింది.
ఇలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కు వచ్చే ఏడాది రాబోతున్నాయి.ఈ మొత్తం సినిమా లు టాలీవుడ్ రేంజ్ ను అంతకు మించి అన్నట్లుగా మార్చడం ఖాయం అనిపిస్తుంది.
కరోనా కారణంగానే ఇందులో కొన్ని ముఖ్య ప్రాజెక్ట్ లు ఓకే అయ్యాయి అనేది టాక్.