సినిమా రంగంలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.ఒక హీరోతో కలిసి నటించిన హీరోయిన్ కొద్ది కాలం తర్వాత అదే హీరోకు సిస్టర్ గా చేస్తుంది.
అలాగే ఇంచు మించు సమాన వయసులున్న నటులు తండ్రి కొడుకుల పాత్రలు చేసిన సందర్భాలూ ఉన్నాయి.తన కంటే వయసులో పెద్దవాడైన హీరోకు మామగా చిన్న వయసు వాళ్లు నటించిన సినిమాలూ ఉన్నాయి.
ప్రకాశ్ రాజ్ కూడా చాలా సినిమాల్లో తండ్రి క్యారెక్టర్ చేశాడు.అయితే తనతో సమానమైన వయసుతో పాటు తన కంటే ఎక్కువ వయసున్న వారికి తండ్రిగా నటించడం విశేషం.అలా తనతో సమానమైన ఏజ్ గ్రూప్ ఉన్న ఏ హీరోలకు తండ్రిగా, మామగా నటించాడో ఇప్పుడు చూద్దాం.
వెంకటేష్- సీతమ్మ వాటికిల్లో సిరిమల్లె చెట్టు

ప్రకాశ్ రాజ్ కంటే వెంకటేష్4 ఏండ్లు పెద్దవాడు.కానీ ఈ సినిమాలో వెంకటేష్ కు తండ్రిగా చేశాడు ప్రకాశ్ రాజ్.
రవితేజ- అమ్మానాన్న ఓ తమిళమ్మాయి

రవితేజ, ప్రకాష్ రాజ్ ఇద్దరూ ఇంచుమించు ఓకే ఏజ్ గ్రూప్ కు చెందినవారు.అయినా ఈ సినిమాలో రవితేజకు తండ్రిగా నటించాడు ప్రకాశ్ రాజ్.
చిరంజీవి- స్టాలిన్

ప్రకాశ్ రాజ్ కంటే చిరంజీవి 10 ఏండ్లు పెద్ద.కానీ ఈ సినిమాలో చిరంజీవి 30 ఏండ్ల వ్యక్తిలా ప్రకాశ్ రాజ్ 70 ఏండ్ల వృద్ధుడిగా నటించారు.
సిద్ధార్థ్-బొమ్మరిల్లు

సిద్ధార్థ్ తో పోల్చితే ప్రకాశ్ రాజ్ కు 13 ఏండ్లు వయసులో పెద్ద.అయినా ఇందులో తండ్రి కొడుకులుగా యాక్ట్ చేశారు.
మహేష్ బాబు-దూకుడు

ఇద్దరికీ 10 ఏండ్లు వయసులో తేడా ఉంది.దూకుడు సినిమాలో ప్రకాశ్ రాజ్ మహేష్ కు తండ్రిగా చేశాడు.
రవితేజ-బలుపు

ఈ సినిమాలో రవితేజకు మామ క్యారెక్టర్ చేశాడు ప్రకాశ్ రాజ్.ఇద్దరి వయసూ ఇంచుమించు సమానం.
చిరంజీవి-ఇంద్ర

ఈ సినిమాలో చిరంజీవికి మామగా నటించాడు ప్రకాశ్ రాజ్.చిరు ప్రకాశ్ రాజ్ కంటే 10 ఏండ్లు పెద్ద కావడం విశేషం.
వెంకటేష్- నువ్వునాకు నచ్చావ్

ఈ సినిమాలో వెంకటేష్ కు మామగా నటించాడు ప్రకాశ్ రాజ్.ఈ సినిమా తీసే సమయంలో వెంకటేష్ కు 41 ఏండ్లు కాగా ప్రకాశ్ రాజ్ కు 36 ఏండ్లు కావడం గమనార్హం.