ఆ పరిస్థితులను చూసి నా గుండె బద్దలైంది అంటున్న సత్య నాదెళ్ల..!

సెకండ్ వేవ్ లో విజృంభిస్తున్న కరోనా కారణంగా భారత ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.సరికొత్త వైరస్ వేరియంట్లు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండగా.

 Microsoft Ceo Satya Nadella Reacts To Corona Second Wave Effect On India , Micro-TeluguStop.com

రోగులు కృత్రిమ ఆక్సిజన్ కోసం క్యూ కడుతున్నారు.మరోవైపు ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలా మంది రోగులు నూరేళ్లు నిండకుండానే మృత్యువాత పడుతున్నారు.

దీంతో భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్మశానాలు కొవిడ్ రోగుల మృతదేహాలతో నిండిపోతున్నాయి.వీటికి సంబంధించిన దృశ్యాలు టీవీలలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఐతే ఈ దృశ్యాలన్నీ కూడా సగటు భారతీయుడిని కంటతడి పెట్టిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ప్రస్తుతం భారత దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

తాను పుట్టిన దేశం కరోనా మహమ్మారి తో విలవిలలాడుతుంటే సత్య నాదెళ్ల గుండె బరువెక్కి భావోద్వేగానికి గురయ్యారు.

సోమవారం రోజు ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసిన సత్య నాదెళ్ల.కరోనాతో సతమతమవుతున్న భారతదేశానికి సాయం చేసేందుకు అమెరికా దేశం ముందుకు వచ్చిందని.అందుకు అమెరికా దేశానికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు.

మైక్రోసాఫ్ట్ సంస్థ తమ గొంతెత్తి భారతదేశానికి ఎల్లప్పుడూ సపోర్ట్ గా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.భారత దేశం ప్రజల కోసం చేస్తున్న సహాయక చర్యలకు సాయం అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ తమ వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని ఆయన తెలిపారు.కీలకమైన ఆక్సిజన్ పరికరాల కొనుగోలు విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్ కి ఎల్లప్పుడు మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

“భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు నా గుండె పగిలిపోయింది.సహాయం కోసం యుఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు కృతజ్ఞుతలు తెలుపుతున్నాను.సహాయక చర్యలకు సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ తన వాయిస్, వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుంది.క్లిష్టమైన ఆక్సిజన్ పరికరాల కొనుగోలుకు మద్దతు ఇస్తుంది,” అని సత్య నాదెళ్ల తన ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube