ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రం చిరంజీవి 152 వ సినిమాగా రాబోతుంది.ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా రామ్ చరణ్ కూడా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు.
కొరటాల శివ ఈ సినిమాను నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తి చేసుకుంది.
ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొద్దీ సమయం కనిపించి ప్రేక్షకుల్ని అలరించబోతుంది.
వీరిద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది.ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని ఇప్పటికే కొరటాల శివ తెలిపారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 20 కోట్లు ఖర్చు చేసి మరి ధర్మస్థలి అనే భారీ ఆలయం సెట్ వేయించారు కొరటాల.దాదాపు 20 ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మించారు.
అయితే అంత ఖర్చు పెట్టి సెట్ వేయడానికి ఒక కారణం ఉందట.ఎందుకంటే ఈ సినిమాలో దాదాపు 60 శాతం షూటింగ్ ఈ సెట్ లోనే పూర్తి చేశారట.
చిరంజీవి, రామ్ చరణ్ మధ్య జరిగే కీలక సన్నివేశాలను కూడా ఈ ధర్మస్థలి సెట్ లోనే పూర్తి చేశారట.అందుకే కొరటాల ఈ సెట్ కు అంత బడ్జెట్ పెట్టాడట.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు.అందుకే ఈ సినిమా విడుదల కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది.