నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ నభా నటేష్.మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు తరువాత తన గ్లామర్ తో కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా కుర్రకారు మనసు దోచింది.
గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ అందాల భామ టాలీవుడ్ లో కుర్ర హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది.ఈ ఏడాది సాయి తేజ్ కి జోడీగా సోలో బ్రతుకే సొ బెటరు సినిమాతో నభా నటేష్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు నితిన్ కి జోడీగా మ్యాస్ట్రో అనే సినిమాలో నటిస్తుంది.
బాలీవుడ్ హిట్ మూవీ అందాధున్ కి రీమేక్ గా ఈ సినిమా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.
ఈ మధ్య కాలంలో మల్లు, కన్నడ భామలు టాలీవుడ్ లో తన హవాని కొనసాగిస్తున్నారు.గతంలో నార్త్ భామల తరహాలో కాకుండా మొదటి సినిమా నుంచి వారి టాలెంట్ ని చూపించుకుంటున్నారు.
అలాగే బాష అర్ధమైతే క్యారెక్టర్ మరింత అద్బుతంగా పండించొచ్చు అనే ఉద్దేశ్యంతో తెలుగు బాష మీద పట్టు సాధిస్తున్నారు.దీంతో చాలా వేగంగా తెలుగు నేర్చుకొని తన పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, నివేతా పేతురాజ్ లాంటి భామలు తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.వీరిని చూసి రాశీఖన్నా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా సొంత గొంతుక వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
తమన్నా ఇప్పటికే ఎఫ్2 లో సొంత గొంతు వినిపించింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామల వరుసలో నభా నటేష్ కూడా చేరిపోతుంది.స్వతహాగా బెంగుళూరు కావడం వలన తెలుగు బాషని ఏ భామ చాలా వేగంగా నేర్చుకుంది.ఈ నేపధ్యంలో మ్యాస్ట్రో సినిమా కోసం మొదటి సారి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
.