సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. గీత గోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ కాస్త గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమా తో రాబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యాయి.మూడవ షెడ్యూల్ ను ప్రారంభించేందుకు దర్శకుడు పరశురామ్ ఏర్పాట్లు పూర్తి చేశాడు.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మూడవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో నిర్వహించబోతున్నారు.ఇప్పటికే ఆ స్టూడియోలో సెట్టింగ్ ల నిర్మాణం జరిగింది.
సెట్స్ నిర్మాణం కు ప్రత్యేక శ్రద్ద కనబర్చారు.సినిమాలోని కీలక సన్నివేశాలు ఒక భారీ బ్యాంక్ సెటప్ లో నిర్వహించబోతున్నారు.
అందుకు సంబంధించిన సెట్టింగ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యింది.అలాగే ఒక ఔట్ డోర్ సెట్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు.
సినిమా లోని కీలక సన్నివేశాలను మూడవ షెడ్యూల్ లో నిర్వహించబోతున్నారు.ఈ నెల రెండవ లేదా మూడవ వారంలో మూడవ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.
దాదాపుగా నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో బ్యాంక్ కు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరించడంతో పాటు కొన్ని ముఖ్యమైన హీరో హీరోయిన్ కాంబో సీన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట.వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది కనుక మెల్లగా షూటింగ్ ను చేస్తున్నారు.