తెలంగాణలో రాజన్న బిడ్ద వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాజకీయ వర్గాల్లో ఎన్నో సందేహలు మొదలైయ్యాయట.
ఇలా వచ్చే కొన్ని విషయల్లో క్లారీటి ఇచ్చిన షర్మిల తాజాగా పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందని ధీమా వ్యక్త్మ చేస్తూ, తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని, వైఎస్సార్ పేరు చాలని ఉద్ఘాటించారు.
ఇదిలా ఉండగా త్వరలోనే తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల నేడు 10 జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించబోతున్న సభకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.కాగా ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన రోజని, అందుకే ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు.