టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.అయితే ప్రభాస్ కి ఇప్పటికే నాలుగు పదుల వయస్సు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడంతో ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి విషయం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
దీంతో కొంతమంది ప్రభాస్ అభిమానులు తొందర్లోనే టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి ని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అప్పట్లో పలు పుకార్లు కూడా పుట్టించారు.కానీ అనుష్క శెట్టి మాత్రం ప్రభాస్ తనకి మంచి స్నేహితుడని తమ మధ్య ప్రేమ, గీమా వంటివి లేవని స్పష్టం చేసింది.
అయితే ఆ మధ్య కాలంలో ప్రభాస్ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ పలు వార్తలు బలంగా వినిపించాయి.అయితే ఆ యువతి ఎవరో కాదు ప్రియ లాల్… ఈమె గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినప్పటికీ అమెరికాలో తన చదువులను పూర్తి చేసింది.
అంతేకాకుండా ఇటీవలే తెలుగులో ప్రముఖ నటుడు సత్య దేవ్ హీరోగా నటించిన “గువ్వ గోరింక” చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయం అయింది.అయితే ప్రియ లాల్ తమిళం, మలయాళంలో కూడా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

కాగా నటి ప్రియా లాల్ కుటుంబ సభ్యులకు మరియు సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందువల్లనే ప్రియా లాల్ ని ప్రభాస్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అప్పట్లో ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.అయితే ప్రభాస్ పెళ్లి పై ఇలాంటి పుకార్లు కొత్తేమి కాదు. ఈ మధ్య కూడా ప్రభాస్ అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ పలు వార్తలు బలంగా వినిపించాయి.అయినప్పటికీ ప్రభాస్ కుటుంబ సభ్యులు కనీసం ఈ వార్తల గురించి స్పందించడం లేదు సరి కదా పట్టించుకోవడం కూడా లేదు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రియ లాల్ మలయాళ భాషలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ప్రభాస్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే కే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తవడంతో జూన్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.