సరికొత్త రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటూనే మెల్లిమెల్లిగా తెలంగాణ లో బలం పెంచుకునేందుకు వైయస్ షర్మిల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.ఏప్రిల్ 9వ తేదీన పార్టీ పేరును ప్రకటించిన దగ్గర నుంచి, విరామం లేకుండా ఎన్నికల వరకు ప్రజల్లో ఉండే విధంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు.
టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో తాము ప్రత్యామ్నాయం అనే విషయాన్ని షర్మిల గట్టిగా హైలెట్ చేసుకుంటున్నారు.తెలంగాణలో దొరల పరిపాలన పోవాలని, రాజన్న రాజ్యం రావాలని పదే పదే షర్మిల చెబుతున్నారు.
తాను కొండను ఢీ కొడుతున్నాను అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి షర్మిల చెబుతున్నారు.అంతేకాదు తెలంగాణలో పెద్దఎత్తున వైఎస్ఆర్ అభిమానులు అందరిని, ఏక తాటి పైకి తీసుకువచ్చి వారందరూ తమ పార్టీకి మద్దతు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తెలంగాణను అభివృద్ధి చేశారు, ఏ విధమైన సుపరిపాలన అందించారు అనే విషయాన్ని జనాల్లోకి షర్మిల తీసుకువెళ్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి పరిపాలన లోను ఆయన సంక్షేమ పథకాలను చూపించి ఓట్లు సంపాదించుకునేందుకు, పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు.దీంతో పాటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తూ, తెలంగాణలో బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఖమ్మంలో షర్మిల ఏప్రిల్ తొమ్మిదో తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే దీనికి అనుమతి లభించింది.లక్షలాదిగా జనాలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
వారి మధ్యే పార్టీ పేరును ప్రకటించాలని చూస్తున్నారు.
ఖమ్మం తో పాటు మరో రెండు మూడు జిల్లాల్లో తమకు పట్టు ఉందని , అక్కడ పూర్తిగా పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకుని, తరువాత మిగతా జిల్లాలపై పూర్తి ఫోకస్ పెంచి తనకు ఎదురు లేకుండా చేసుకునేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు.
అందుకే పెద్ద ఎత్తున తమ స్నేహితులు, ఇతర పార్టీల లోని నాయకులను చేర్చుకునేందుకు వారికి ఫోన్ చేయిస్తూ మంతనాలు చేస్తున్నారు.తెలంగాణలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుచేసి చూపించారో, అదే విధమైన పరిపాలనను తాను అందిస్తానని చెబుతూనే వైఎస్ఆర్ పాలన, కెసిఆర్ పరిపాలనకు పోలిక చూపిస్తూ షర్మిల శరవేగంగా బలపడే విధంగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారు.
<