క్రిష్ణగాడి వీరప్రేమకథ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మెహరీన్.ఈ అమ్మడు తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో సందడి చేసింది.రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజతో ఆడిపాడింది.అలాగే ఎఫ్2 సినిమాలో ఆమె చేసిన ఫన్ రోల్ కి మంచి గుర్తింపు వచ్చింది.నటిగా పెర్ఫార్మెన్స్ తో మార్కులు వేయించుకున్న మెహరీన్ ఇప్పుడు పెళ్లికూతురైంది.తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ ని ఆమె పెల్లాదనుంది.
అతను హర్యానా మాజీ సీఏం మనవడు కావడం విశేషం.ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా కూడా అది ప్రేమగా మారింది మాత్రం రీసెంట్ గానే అని తెలుస్తుంది.
ఇక మార్చి 13న మెహరీన్, భవ్య నిశ్చితార్ధం చేసుకున్నారు.గత నెలలోనే ఈ అమ్మడు తాను పెళ్ళికి రెడీ అవుతున్న విషయాన్ని తన ప్రియుడుని పరిచయం చేసి సోషల్ మీడియా ద్వారా చెప్పింది.
అయితే అంత వరకు ఆమె ప్రేమికుడి విషయంలో సీక్రెట్ మెయింటేన్ చేసింది.ఇదిలా ఉంటే తాజాగా భవ్య బిష్ణోయ్ పుట్టినరోజు సందర్భంగా అతను తనకి ఎలా ప్రపోజ్ చేసింది ఇన్స్టాగ్రామ్ ద్వారా మెహరీన్ షేర్ చేసింది.
భవ్య పుట్టినరోజు సమయంలో అండమాన్ కు వెళ్ళాము.అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు అండర్ వాటర్ లో ఉన్నప్పుడు బిష్ణోయ్ ప్రపోస్ చేసాడట.నీటిలో భవ్య దగ్గరకు వచ్చి తనకు విల్ యూ మ్యారీ మీ? అనే ప్రపోసల్ కార్డు చూపించి లవ్ ప్రపోజ్ చేశాడని మెహ్రీన్ తెలిపింది.ఆ ప్రపోసల్ చాలా స్పెషల్ గా అనిపించిందని మెహరీన్ చెప్పుకొచ్చింది.
దీంతో అతని ప్రపోజ్ ని ఏ మాత్రం కాదనలేకపోయాను అనే విషయాన్ని చెప్పింది.ఇక వీరి ఎంగేజ్మెంట్ వేడుక రాజస్థాన్ లోని జైపూర్ అలీలా కోటలో జరగగా, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తెలియజేసింది.
అయితే పెళ్లి ఎప్పుడు ఉంటుంది.ఎక్కడ ఉంటుంది అనే విషయాలని మాత్రం మెహరీన్ రివీల్ చేయలేదు.