కరోనా మహమ్మారి దెబ్బకు దేశాలకు దేశాలు తీవ్ర ఆర్ధిక నష్టాల్లో కూరుకు పోయాయి.ప్రజల ప్రాణాలు పిట్టలు రాలినట్టు రాలిపోయాయి.
ఎంతో మంది వైద్యులు, నర్సులు కరోన రోగుల సేవలోనే కన్ను మూశారు, మరణించిన వారిలో భారత సంతతి వైద్యులు, నర్సులు కూడా ఉన్నారు.యావత్ ప్రపంచం మొత్తం కరోనా ధాటికి భయపడక తప్పలేదు.
అయితే దుబాయ్ లోని భారతీయ నర్సు ముందు మాత్రం కరోనా తలవంచక తప్పలేదు.
దుబాయ్ లో మెడోర్ అనే ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న భారత సంతతి నర్సు బ్లెస్సి కరోనా పై రెండు సార్లు యుద్ధం చేసింది.
మొదటి సారిగా గడిచిన సంవత్సరం మార్చి నెలలో కరోనా బారిన పడిన బ్లెస్సి ఆసమయంలో గర్భవతి కూడా.దుబాయ్ లో అప్పుడప్పుడే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయం కావడంతో ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రత్యేక వైద్యం అందించి కోలుకునేలా చేశారు.
రెండు వారాలా తరువాత ఆమె ఆసుపత్రి నుంచి బయటకు వచ్చింది.
ఈ క్రమంలోనే బ్లెస్సి పాపకు జన్మనివ్వడం అందరూ సంతోషంగా ఉన్నారు అనుకున్న సమయంలోనే మరో సారి అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 26 వ తేదీన రెండవ సరి కరోనా బారిన పడింది బ్లెస్సి .పాపతో పాటు, ఆమె భర్త, తల్లి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో నలుగురు కరోనా పరీక్షలు చేయించుకోగా బ్లెస్సి తో పాటు ఆమె భర్త కు కూడా కరోనా పాజిటివ్ తేలడంతో ఇంట్లోనే ఉంటూ కరోనా చికిత్స తీసుకుంటున్నారు.మొదటి సారి కరోనా వచ్చిన అనుభవం, మానసికంగా ఎలా ధృడంగా ఉండాలో బ్లెస్సి కి తెలియడం స్వతహాగా నర్సు కావడంతో ఆమె, ఆమె భర్త రెండు వారాల తరువాత కరోన నుంచీ బయటపడ్డారు.
ఏడాది కాలంలో బ్లెస్సి రెండు సార్లు కరోనా బారిన పడి కోలుకోవడంతో దుబాయ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.