తెలంగాణలో గులాభి పార్టీలోని నేతల మధ్య ఎన్ని విభేదాలున్న కూడా అధిష్టానం వాటిని బయటకు పొక్కకుండా తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటుందట.అందుకే ఎన్ని లుకలుకలు పార్టీలో ఏర్పడ్ద ప్రజల ముందుకు మాత్రం ఏపీ రాజకీయాల్లా బయటకు పొక్కడం లేదంటున్నారు.
ఇక కొందరి నేతల మధ్య ఆధిపత్యపోరు కూడా సాగుతున్న విషయం తెలిసిందే.ఎక్కడ పార్టీలో ఉన్న లోసుగులు బయటకు వస్తే అవి పార్టీ మనుగడను దెబ్బతీస్తాయనే భయంతో గులాభి బాస్ పరిస్దితి చేయిదాటిపోకుండా కాపాడుకుంటున్నారట.
కానీ అప్పుడప్పుడు మాత్రం నేతలు ఆగడం లేదు.
ఈ నేపధ్యంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సొంత పార్టీ నేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశిస్తూ, నేడు నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని, పదవులు, పనులు అమ్ముకుంటు సిగ్గు లేకుండా నీతులు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.<
అదీగాక ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించలేదని, ఒకవేళ నేను అవినీతి చేసినట్లుగా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ కడియం సవాల్ విసిరారు.
ఇలా ప్రస్తుతం కడియం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారి తీస్తున్నాయట