మసాలా దినుసులు ప్రతి ఒక్కరి వంటింట్లో ఇవి కామన్‌గా ఉంటాయి.జీలకర్ర, మిరియాలు, యాలుకలు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, జాజి కాయ, జాపత్రి, సోంపు ఇలా ఎన్నో మసాలా దినుసులు ఉన్నాయి.
ఘాటైన రుచి, వాసస కలిగి ఉండే ఈ మసాలా దినుసులను మన భారతీయులు వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.ఇక ఈ మసాలా దినుసుల్లో బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా మసాలా దినుసులు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొన్ని కొన్ని మసాలా దినుసులను అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అలాంటి వాటిలో నల్లమిరియాలు ముందు వరసలో ఉంటాయి.వీటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కడుపులో మంట, చర్మం డ్రైగా మారిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.మరియు ఏవైనా మందులు వాడినపుడు వీటిని ఓవర్‌గా తీసుకుంటే రియాక్షన్స్ తలెత్తి అలర్జీలు వస్తాయి.
అలాగే కొందరు ఆరోగ్యానికి మంచిదని జీలకర్రను తెగ తింటుంటారు.కానీ, జీలకర్రను అతిగా తీసుకుంటే శరీర వేడికి కారణం అవుతుంది.దాల్చిన చెక్క కూడా అతిగా తీసుకోరాదు.
దాల్చిన చెక్కలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ అతిగా తీసుకుంటే నోటి అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
అలాగే గసగసాలను కూడా ఓవర్ గా తీసుకోరాదు.వాస్తవానికి గసగసాలను వంటల్లోనే కాదు కొన్ని జబ్బులకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.కానీ, వీటిని అతిగా తీసుకుంటే మాత్రం ముఖ్యంగా మగవారిలో సంతాన సమస్యలు తలెత్తుతాయి.
ఇక మెంతులను కూడా అతిగా తీసుకోరాదు.మెంతులు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ ఎక్కువగా తీసుకుంటే ఆస్తమా పెరగడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వచ్చే రిస్ఖ్ ఎక్కువగా ఉంటుంది.