తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే.ఇక ఆయన చేసే విమర్శలు తప్పుచేసిన వారి గుండెల్లోకి సూటిగా దిగుతాయనడంలో సందేహం లేదు.
ఇక టీడీపీని వదిలి కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ నేతలపై, వారి అవినీతి పై తన మాటల తూటాలను అత్యంత వేగవంతగా వదులుతున్నాడు.ఈ క్రమంలో తాజాగా కేసీయార్ పై కూడా విమర్శలు చేశాడు రేమంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతునని చెప్పుకోవడం కాదని, ఆయన నిజమైన రైతే అయితే రైతులకు ఎందుకు అండగా ఉండటం లేదని మండిపడ్డారు.ఇక ఇదేపంట వేయాలని చెప్పి వారిని మోసం చేశాడని, కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేసిన రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
రైతులకు కనీస మద్దతు ధరను ఇవ్వకుండా, రైతు చనిపోతే మాత్రం రైతు బీమా ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు.
పేదల పొట్ట కొట్టి లాక్కున్న భూములను ప్రైవేట్ కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వం చెప్పే నీతులు వింటే చిప్ప చేతికి వస్తుందని విమర్శించారట రేవంత్ రెడ్డి.
ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని చూస్తూ ఊరుకుంటున్న కారును పంక్చర్ చేస్తానని, తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించాల్సిన సమయం ఆసన్నమైందని, మనకోసం ఎవరూ రారని, మనకు మనమే దిక్కని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారట.