సాధాణంగా కొందరి మోచేతులు నల్లగా, అందం హీనంగా ఉంటాయి.ఈ సమస్యను మగవారు పెద్దగా పట్టించుకోరు.
కానీ, కాలి గోటి దగ్గర నుంచి ముఖం వరకూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ అందాన్ని మరింత రెట్టింపు చేసుకునే ఆడవారు మాత్రం మోచేతులు నల్లగా ఉంటే.అస్సలు సహించరు.
ఈ క్రమంలోనే ఆ నలుపు తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.వేలకు వేలు ఖర్చు పెట్టి అనేక క్రీములు కోనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.
కానీ, న్యాచురల్‌గా కూడా మోచేతుల నలుపును నివారించుకోవచ్చు.
ముఖ్యంగా మోచేతుల నలుపును పోగొట్టడంలో తులసి అద్భుతంగా సహాయపడుతుంది.
మరి తులసిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని తులసి ఆకులను తీసుకుని.
మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి.ఆ తర్వాత అందులో కొద్దిగా నిమ్మ రసం మరియు సాల్డ్ కలిపి.
మోచేతులకు అప్లై చేయాలి.బాగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ కోల్డ్ వాటర్‌తో మోచేతులను క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారంలో మూడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే కొన్ని తులసి ఆకులను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో చిటికెడు పసుపు మరియు పెరుగు వేసి మిక్స్ చేసుకుని.మోచేతులకు అప్లై చేసి.
గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మోచేతులను క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల నలుపు పోతుంది.
ఇక తులిసి ఆకులను దంచి రసం తీసుకుని.
అందులో కొద్దిగా బియ్యం పిండి మరియు తేనె వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించి.
బాగా ఆరిపోనివ్వాలి.ఆ తర్వాత కొద్దిగా వాటర్ జల్లి మెల్లగా రద్దుతూ శ్రుభం చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేయడం వల్ల మోచేతుల నలుపు క్రమంగా పోతుంది.