ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ప్రపంచానికి ఇట్లే తెలిసిపోతుంది.చాలామంది వారి పర్సనల్ జీవితంలోని విషయాలను ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా వారి సన్నిహితులకు స్నేహితులకు చేరవేసేందుకు తెగ ఉత్సాహం చూపుతుంటారు.
ఈ నేపథ్యంలోనే అనేక విషయాలు, మరి కొన్ని వీడియోలు వైరల్ గా మారుతుండటం మనం గమనిస్తూనే ఉంటాం.అందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవ్వడం చూస్తూ ఉంటాం.
తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో కొంతమంది ఓ సరస్సులో చేపలు పట్టేందుకు పడవలో వెళ్లగా ఆ సందర్భంలో వారు వేసిన గాలానికి ఓ చేప పడింది.
అంతవరకు బాగానే ఉన్నా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.గాలానికి చేప దొరికింది అన్న ఆనందంతో ఆ చేపను బయటికి లాగుతున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. గాలానికి చిక్కిన చేప ను బుట్టలో వేసుకుందామని ప్రయత్నిస్తున్న సమయంలో ఆ గాలానికి ఉన్న చేపను తీసుకోబోతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అకస్మాత్తుగా ఆ సరస్సులో ఉన్న ఓ మొసలి గాలానికి చిక్కిన చేపను తీసుకోవాలని ప్రయత్నం చేసింది.
అయితే ఈ ప్రయత్నంలో భాగంగా చాలా సేపు ఆ మొసలి ఆ చేప కొరకు చాలా పోరాడింది.
ఈ సమయంలో ఆ జాలరి మొసలి నోట ఆ చేప పడకుండా తన గళాన్ని గట్టిగా లాగి చివరికి విజయం సాధించాడు.మొసలి చాలా సేపు ఆ చేప కోసం పోరాడిన చివరికి మాత్రం ఆ చేప జాలరికే చిక్కింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.