బిగ్‌బాస్‌ ఈక్వెషన్స్‌ మారిపోతున్నాయి.. విజేత మారేనా?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు వచ్చేసింది.ఈ సీజన్‌ విజేత ఎవరు అనే విషయమై చాలా మంది గత కొన్నాళ్లుగా స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు.

 Is Abhijeet Winner Or Not, Abhijeet, Bigg Boss4, Sohel, Ariyana, Top5 Contestant-TeluguStop.com

సోషల్‌ మీడియాలో బాగా ఫాలోయింగ్‌ ఉన్న అభిజిత్‌ అని.గేమ్‌ చాలా కూల్‌గా అందరిని ఆకట్టుకుంటూ ఆడుతున్న కారణంగా అభిజిత్‌ విన్నర్‌ అవుతాడు అంటూ చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు.అభిజిత్‌ గేమ్‌ విషయంలో చాలా మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో ఆయన ఆట తీరును విమర్శించే వారు కూడా చాలా మంది ఉన్నారు.ఇప్పటి వరకు ఫిజికల్‌ గా ఒక్కటి అంటే ఒక్క గేమ్‌ లో కూడా సక్సెస్‌ అవ్వలేక పోయిన అభిజిత్‌ ఎలా గేమ్‌ విన్నర్‌ అవుతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంలో కొందరు సోషల్‌ మీడియాలో అభిజిత్‌ ను ఓ రేంజ్‌ లో ట్రోల్‌ చేస్తూ ఉన్నారు.

Telugu Abhijeet, Akhil, Ariyana, Avinash, Bigg Boss, Harika, Monal, Sohel, Top-M

గత రెండు మూడు వారాలుగా అనూహ్యంగా ఈక్వెషన్స్‌ మారిపోతున్నాయి.సోహెల్‌ ఎప్పుడో పోతాడు అనుకుంటే చివరి వరకు వచ్చాడు.ఫైనల్‌ 5 లో ఉండే కంటెస్టెంట్స్‌ లో అతడు ఖచ్చితంగా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటికే అఖిల్‌ ఫైనల్‌ 5 లోకి వెళ్లాడు.అరియానా పోరాటం చూస్తుంటే ఈసారి అమ్మాయిని బిగ్‌ బాస్‌ విన్నర్‌ గా నిలిపితే బాగుంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అందుకే ఆమెకు కూడా విన్నంగా అవకాశాలు మెరుగు పడ్డాయి.

ఒక్క మోనాల్‌ విషయంలో తప్ప మిగిలిన అందరి విషయంలో కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.హారిక కూడా కాస్త తగ్గుతున్నా కూడా అసలు విజేత విషయానికి వస్తే అభిజిత్‌, అరియానా, అఖిల్‌ మరియు సోహెల్‌ లలో ఒకరు ఉండే అవకాశం ఉంది.

అభిజిత్‌ కు ఇప్పటికి కాస్త ఎక్కువ ఛాన్స్‌ ఉంది అనిపించినా రాబోయే రెండు వారాల్లో ఏదైనా జరగవచ్చు అంటున్నారు.అందుకే అభిజిత్‌ గెలుపు సాధ్యమేనా అంటూ అభిమానులు సైతం కాస్త కన్ఫ్యూజన్‌ లో ఉన్నారు.

సోహెల్‌ దూసుకు వచ్చిన తీరు అభిజిత్‌ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube