కరోనా మహమ్మారి పుట్టింది చైనా లో అయినా తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది మాత్రం అగ్రరాజ్యం అమెరికాపైనే.అమెరికా లో ఎలాంటి విపత్తులు సంభవించినా ఎన్నడూ కరోనా మిగిల్చిన నష్టంచవి చూడలేదు.
ప్రకృతి విపత్తులు ఎన్ని వచ్చినా సమర్ధవంతగా ఎదుర్కోవడం వెంటనే కోలుకోవడంలో తనకు తానె సాటి అనిపించుకుంది.అయితే ట్రంప్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం, అమెరికా ప్రజలకు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సరైన సూచనలు ఇవ్వకపోగా తప్పుదోవ పట్టించడంతో కరోనా అమెరికన్స్ పై విలయతాండవం చేసిందనే చెప్పాలి.అయితే
అమెరికన్స్ కు ఎన్నికలు అయ్యే వరకూ కాస్తా గ్యాప్ తీసుకుందా లేదంటే ఎన్నికల ర్యాలీలో భాగంగా కరోనా విజ్రుమ్భించిందో గానీ ప్రస్తుతం అమెరికాలో కరోనా మరో సారి విరుచుకు పడుతోంది.రోజు రోజుకి కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవ్వడమే కాకుండా మృతుల సంఖ్య గతంలో కంటే కూడా వేగంగా పెరిగిపోతోంది.
దాంతో అమెరికన్స్ తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గతంలో కరోనా మరణాల సంఖ్య 1000 నుంచి 1200 కు మాత్రమే పరిమితమై ఉండేది కానీ.
కరోనా సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం రోజుకు కరోనా మరణాల సంఖ్య తారా స్థాయికి చేరుకుంటోంది.కేవలం నిన్న ఒక్కరోజులోనే 2500 మరణాలు సంభవించడంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రియల్ తరువాత ఇంత భారీ స్థాయిలో కరోనా మరణాలు నమోదు అవ్వడం ఇదే తొలిసారని, పరిస్థితిని అదుపు చేయకపోతే భవిష్యత్తుల్లో మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఇదిలాఉంటే ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు 1.41 కోట్లు కాగా కరోనా వలన మృతి చెందిన వారి సంఖ్య 2.80 లక్షలకు చేరుకుంది.
.