నాని హీరోగా వివేక్ ఆత్రేయ సినిమాను మైత్రి వారు ప్రకటించారు.నాని గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మైత్రి మూవీ బ్యానర్ లో రూపొందుతున్న మరో సినిమా ఇది.
ఈ సినిమా టైటిల్ విషయంలో ఈనెల 21న క్లారిటీ ఇస్తామంటూ ప్రకటించాడు.ఇదే సమయంలో సినిమా టైటిల్ ను క్లూ గా ఇచ్చారు.
అంటే అనే పదంను ఎక్కువగా వాడటంతో అదే టైటిల్ గా సినిమా రాబోతుంది అనిపిస్తుంది.భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం మైత్రి వారు ఫిల్మ్ ఛాంబర్ లో ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించారట.
సుందరానికి తొందర ఎక్కువ అన్నట్లుగా అర్థం వచ్చేలా ‘అంటే సుందరానికి’ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట.
బ్రోచేవారెవరురా అనే విభిన్నమైన టైటిల్ తో రూపొందిన సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా ప్రేక్షకుల ఆధరాభిమానాలు కూడా దక్కించుకున్నాడు.అందుకే ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.నానితో వరుసగా సినిమాలను నిర్మించేందుకు సిద్దంగా ఉన్న మైత్రి వారు ఈ సినిమా తర్వాత మరో సినిమాను కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న అంటే సుందరానికి సినిమాను వచ్చే నెలలో పట్టాలెక్కించే అవకాశం ఉంది.
సమ్మర్ వరకు సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.కరోనా కారణంగా సినిమాలను ఏడాది చేయడం లేదు.చాలా స్పీడ్ గా చేసేస్తున్నారు.నాని28 సినిమాను కూడా అదే విధంగా స్పీడ్‌గా పూర్తి చేసి ప్రస్తుతం చేస్తున్న టక్ జగదీష్ మరియు శ్యామ్ సింగరాయ్ లతో పాటు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.ఇక నానితో నజ్రియా నటించబోతున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి ఉంది.మలయాళం మరియు తమిళంలో ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ మామూలిది కాదు.అందుకే టాలీవుడ్ లో కూడా కుమ్మేయడం ఖాయం అంటున్నారు.