సౌత్ హీరోయిన్స్ లో అదృష్టం అంటే కచ్చితంగా కాజల్ అగర్వాల్ పేర్లు చెప్పేయొచ్చు.ఈ మగదీర తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా 12 ఏళ్ళుగా ఈ భామ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తుంది.
ఈమెతో పోటీ పడ్డ తమన్నా, సమంత ఇప్పుడు రేసులో వెనుకబడిపోయారు.కాజల్ మాత్రం తెలుగు, తమిళ బాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
ప్రస్తుతం తెలుగు ఆచార్య సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.మరో వైపు తమిళంలో ఇండియన్ 2 తో పాటు తుపాకీ సీక్వెల్ లో కూడా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
అలాగే హిందీలో ముంబై సాగా అనే సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇలా మూడు భాషలలో మూడు భారీ బడ్జెట్ సినిమాలు కాజల్ అగర్వాల్ చేతిలో ఇప్పుడు ఉన్నాయి.
మొత్తానికి స్టార్ హీరోయిన్ గా తనకి మరో మూడేళ్ళ పాటు ఎలాంటి డోకా లేకుండా చేతిలో సినిమాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
సూర్యతో ఆరు, వేల్ చిత్రాలతో పాటు సింగం సీరీస్ లో మూడు సినిమాలు తీసి సక్సెస్ ఫుల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సూర్య ఇప్పుడు మరో చిత్రాన్ని చేస్తున్నాడు.ఇప్పటి వరకు యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వీరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి.
అయితే ఈ సారి ఫుల్ ఫ్యామిలీ డ్రామాతో కొత్త సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.ఇందులో కథానాయికగా తాజాగా కాజల్ ను తీసుకున్నట్టు సమాచారం.ఇప్పటికే కాజల్ బ్రదర్ సినిమాలో సూర్యకి జోడీగా నటించింది.ఈ సినిమా కన్ఫర్మ్ అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా అవుతుంది.
ఈ సినిమాకి ఫైనల్ అయితే అమ్మడు చేతిలో ఏకంగా నాలుగు పెద్ద ప్రాజెక్ట్లు ఉన్నట్లే.అయితే ఈ సినిమాలో కాజల్ నటించే విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి.