బాబోయ్: కరోనా ను అంతం చేసే ఔషధమే లేదంటున్న WHO

ఒకపక్క ప్రపంచ దేశాలు ఈ కరోనా మహమ్మారిని అంతం చేయాలి అని అహర్నిశలు పరిశోధనలు చేసి ఒక వ్యాక్సిన్ ను కనిపెట్టే పనుల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు.ఈ వ్యాక్సిన్ తో పూర్తిగా కాకపోయినా ఎదో ఒక మోస్తారుగా జనాలు కొందరైనా కోలుకుంటారు అని అందరూ భావిస్తున్న ఈ సమయం లో WHO ఒక పిడుగులాంటి వార్త చెప్పింది.

 బాబోయ్: కరోనా ను అంతం చేసే ఔషధ�-TeluguStop.com

అదే ఈ మహమ్మారిని అంతం చేసే ఔషధం లేదంటూ తాజాగా వెల్లడించింది.ఈ మహమ్మారికి జనాలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తప్ప ఈ వైరస్ ను పూర్తి గా అంతం చేసే ఔషధం మాత్రం లేదంటూ స్పష్టం చేసింది.

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ ఎల్లప్పుడూ చేతులు శుభ్రముగా కడుక్కోవడం అలానే భౌతిక దూరం పాటించడం తో పాటు మాస్క్ లు ధరించడం వంటి చర్యలపై దృష్టి పెట్టాలి అంటూ ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రిసియస్‌ కూడా ఈ అంశం పై మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పటికిప్పుడు అంతం చేసే ఎలాంటి చికిత్స అయితే లేదు కానీ భవిష్యత్తు లో కూడా ఈ వైరస్ కు అంతం అనేది ఉండకపోవచ్చు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే జంతువుల నుంచి ఈ మహమ్మారి సోకుతుంది అని అధ్యయనాల్లో వెల్లడైన నేపథ్యంలో అసలు ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా ప్రవేశించింది అన్న దానిపై WHO తీవ్ర కసరత్తులు చేస్తుంది.

Telugu Corona, Corona Vaccine, Generaltedros, Coronadifficult-

ఇప్పటికే దీనిపై ఒక స్పష్టత తీసుకోవడం కోసం చైనా కు ఈ సంస్థ ప్రతినిధులను పంపించి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ మహమ్మారి ఎలా మనుషుల్లోకి ప్రవేశించింది అన్న దానిపై చైనా పరిశోధకులతో పాటు ఈ సంస్థ కూడా కలిసి పని చేయనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube