ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.సరైన సమయంలో తీసుకోవడం అంతే ముఖ్యం.
ఆహారాన్ని సరైన టైమ్‌లో తీసుకోకపోతే పోషకాహార లోపం ఏర్పడుతుంది.తద్వారా అజీర్తి, రక్తహీనత, నిద్రలేమి, గుండె జబ్బులు, అధికబరువు, ఎముకల సమస్యలు, రక్తపోటు ఇలా చేప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మరి ఆ ఆహారాలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.రాత్రి వేళల్లో మాంసాహారానికి దూరంగా ఉండండి.ఎందుకంటే.మాంసంలో ఉండే అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు జీర్ణం కాకుండా ఇబ్బంది పెడతాయి.రాత్రి భోజనం తర్వాత స్వీట్లు.
అది కూడా పంచదారతో చేసిన స్వీట్లు అస్సలు తినకూడదు.ఎందుకంటే.
రాత్రి వేళ స్వీట్లు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణపై ఒత్తిడి పెరుగి.హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది.
అలాగే రాత్రిపూట శరీరం నిద్రావస్థలో ఉంటుంది కాబట్టి తక్కువ శక్తి అవసరం అవుతుంది.కడుపు నిండుగా తిని పడుకుంటే అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.కేలరీలు ఖర్చయ్యే అవకాశం తక్కువ కాబట్టి బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.అందుకే రాత్రి వేల తక్కువ క్యాలరీ, త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినాలి.
అన్నంలో కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి.ఇవి బరువు పెంచేందుకు సహకరిస్తుంది.
కాబట్టి, అన్నానికి బదులుగా గోదుమ లేదా జొన్న రొట్లు తినడం ఉత్తమం.అదేవిధంగా, రాత్రి వేళ్లలో పండ్లు తినడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే.పండ్లలో ఉండే యాసిడ్లు గాస్ట్రిక్ సమస్యలు వచ్చేలా చేస్తుంది.
అలాగే రాత్రి సమయంలో పిజ్జాలు, బర్గర్లు, కాఫీ, టీలు, నట్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.