సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.ఇలాంటి సమయంలో ఆమె మీద ఒక న్యూస్ వైరల్ అయ్యింది.
కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని, ఆమె తండ్రి ఇప్పటికే వరుడుని చూడటం జరిగింది అని ప్రచారం జరిగింది.ఇక వరుడు కూడా బీజేపీ పార్టీ నేతకి చెందిన కొడుకుని, ప్రముఖ వ్యాపారవేత్త అంటూ కథనాలు వినిపించాయి.
గత కొద్ది రోజులుగా సౌత్ ఇండియా ఫిలిం సర్కిల్ లో ఈ వార్త ట్రెండింగ్ గా మారింది.ఈ నేపధ్యంలో తన పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ స్పందించక తప్పలేదు.
ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చిచెప్పింది.వదంతులను వ్యాపింప చేయవద్దని కీర్తి సురేష్ ఈ సందర్భంగా కోరింది.మరో ఏడాది వరకు సినిమాలతో బిజీగా ఉన్నానని, అసలు పెళ్లి చేసుకునేంత తీరిక తనకి లేదని, కాల్షీట్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి అని తెలిపింది.ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని ఎదురు ప్రశ్నించింది.
కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో ఈ గాసిప్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.స్టార్ హీరోయిన్ గా మంచి ఊపు మీద ఉన్న ఇలాంటి టైంలో ఏ హీరోయిన్ కూడా పెళ్లి గురించి ఆలోచించే అవకాశం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కీర్తి సురేష్ అయితే ఇప్పుడు మంచి లీడ్ హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది కాబట్టి ఆ అవకాశమే లేదని చెప్పుకుంటున్నారు.