ప్రస్తుతం టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ నారప్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్ష న్స్ పై ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ నటించినటువంటి అసురన్ చిత్రానికి రీమేక్ గా ఉంది.
అయితే ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇందులో భాగంగా పలు రకాల యాక్షన్ కి సంబంధించినటువంటి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ యాక్షన్ సంబంధిత సీన్ల కోసం విక్టరీ వెంకటేష్ బాగానే కష్టపడుతున్నాడు.
ఇందుకుగాను తమిళ నాడులో రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు అనే ఎడారి ప్రాంతంలో ఎర్రటి ఎండలో చెమట చిందిస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా టాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ పని చేస్తున్నాడు.