స్కూల్ కు వెళ్లి చదువుకోవాల్సిన 10 వ తరగతి విద్యార్థి ఏకంగా ఆ స్కూల్ నే పేలుస్తాను అంటూ బెదిరింపు లేఖ రాశాడు.ఈ ఘటన బరేలి లోని ఒక పాఠశాలలో చోటుచేసుకుంది.
స్కూల్ యాజమాన్యానికి ఆదివారం ఒక లేఖ వచ్చింది.స్కూల్ లో బాంబులు అమర్చానని, రూ.2 లక్షలు గనుక ఇవ్వకపోతే పుల్వామా ఉగ్రదాడి తరహాలో మీ పాఠశాల ను పేలుస్తాను అంటూ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే స్కూల్ లో బాంబులు కూడా అమర్చినట్లు లేఖలో రాయడం తో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం ఈ సమాచారం పోలీసులకు అందించగా డాగ్ స్క్వాడ్ బృందం తో వచ్చి తనిఖీలు నిర్వహించారు.
అయితే స్కూల్ లో ఎలాంటి బాంబులు అమర్చకపోవడం తో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అయితే తిరిగి మంగళవారం కూడా లేఖ రావడం తో దానిలో డబ్బులు కూడా డిమాండ్ చేయడం తో మరలా పోలీసులకు సమాచారం అందించారు.
దీనితో రంగంలోకి దిగిన పోలీసులు అసలు ఈ లేఖలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, అసలు ఈ బెదిరింపు లేఖ ఎవరు రాశారు అన్న కోణం లో దర్యాప్తు చేపట్టారు.అయితే ఆ విద్యార్థి ఉపయోగించిన పేపరే చివరికి అతడిని పట్టించింది.
అతడు బెదిరింపు లేఖ కోసం ఉపయోగించిన పేపర్ అదే స్కూల్ కు చెందిన సైన్స్ నోట్ బుక్ లోనిదిగా గుర్తించారు.
అది కూడా 9, 10 తరగతి విద్యార్థుల నోట్‌బుక్స్‌లోని పేపర్ గా అధికారులు కనిపెట్టి చివరికి ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆ విద్యార్థిని విచారించగా ఆ లేఖ రాయడంలో అతని ప్రమేయం లేదని, మరో వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు.ఎవరా వ్యక్తి,ఎందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు అన్న వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు.