యోగి వ్యాఖ్యలపై ఈసీ కి ఫిర్యాదు చేసిన ఆప్

ఢిల్లీ లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పార్టీలు ప్రచారంలో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఢిల్లీ లో అధికారం చేపట్టడం కోసం తనదైన శైలి లో వ్యూహాలు రచిస్తుంది.

 App Complainedagainst Yogi Adityanath To Election Commission-TeluguStop.com

ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.నిన్న దక్షిణ ఢిల్లీలోని బదర్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ పై తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు.దీనితో యోగి వ్యాఖ్యలపై ఆప్ సీరియస్ అయ్యింది.

దీనితో యోగి పై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘాన్ని కలిసింది.ఆయన పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ఎన్నికల ప్రచారం నుంచి బహిష్కరించాలి అంటూ ఆప్ పార్టీ కోరింది.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కేజ్రీవాల్ తెగ బాధపడిపోతున్నారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చూస్తుంటే.

కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ విభజన శక్తులకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ ఏకైక లక్ష్యమని యోగి స్పష్టం చేశారు.

అంతేకాకుండా షాహిన్‌బాగ్ నిరసనకారులకు కేజ్రీవాల్ బిర్యానీ సరఫరా చేస్తున్నారంటూ యోగి ఆరోపణలు చేయడం పై ఆప్ తీవ్రంగా స్పందించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube