గత ఏడాది ఎన్నికల సమయంలో యావత్ దేశం మొత్తం మోడీ హవా నడుస్తుంటే దేశ రాజధాని లో మాత్రం మోడీ కి బదులుగా క్రేజీవాల్ హవా నడిచింది…క్రేజీవాల్ ని తమవైపుకి తిప్పుకోవడానికి మోడీని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టినా సరే సమర్ధవంతంగా ఎదుర్కున్న నేతగా క్రేజీవాల్ ఎన్నో సంచలనాలకి మూల బిందువు అయ్యారు.ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ఆప్ అధ్యక్షుడిగా క్రేజీవాల్ రాజకీయ ప్రస్తానం అంతా ఒక సంచలనమే.
అయితే అలాంటి క్రేజీవాల్ తన పార్టీని దేశంలో అనేక రాష్ట్రాలలో విస్తరించాలని అనుకున్నాడు అందులో భాగంగానే ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కొన్ని నెలల క్రితం కలిసిన క్రేజీవాల్.సుదీర్హంగా రాజకీయాలపై చర్చించుకున్నారు…భవిష్యత్తులో ఏపీలో జనసేనకి ఆప్ మద్దతు ఇచ్చేలా తెలుగు రాష్ట్రాలలో ఆప్ ని విస్తరింప చేయాలని క్రేజీవాల్ వ్యూహాలు సిద్డం చేసుకున్నారు అయితే ఆతరువాతి కాలంలో పవన్ క్రేజీ పై అంతగా ఆసక్తి చూపించక పోవడంతో క్రేజీ కూడా లైట్ తీసుకున్నాడని టాక్ కూడా ఉంది.
ఇదిలాఉంటే.
ఏపీలో టీడీపీ వైసీపీ వలన ప్రజలకి ఒరిగింది ఏమి లేదని నిర్ధారించుకున్న పవన్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
మూడో కూటమే ఏపీలో ప్రత్యామ్నాయంగా ఉండాలని అయితే ఈ మహా కూటమికి వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసేన, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ, ఎంసీపీఐ, బీఎస్పీ పార్టీల మద్దతు ఉంటుందని మూడో అతిపెద్ద కూటమిగా ప్రజల ముందు త్వరలో వస్తుందని అనుకున్నారు.ఒకడుగు ముందుకు వేసి ఈ కూటమిలో సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ని ఎంచుకున్నామని స్టేట్మెంట్లు ఇచ్చారు కూడా అయితే
కూటమి కలలు కంటున్నా వారికి ఇప్పుడు ఆప్ పెద్ద షాక్ ఇచ్చింది.క్రేజీ వాల్ మద్దతు తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పకనే చెప్పేసింది అంతేకాదు టీడీపీ ఆప్ ల మధ్య భంధం కూడా వేగంగా బలపడుతూ వచ్చింది.కొద్ది రోజుల క్రితం గవర్నర్ విషయంలో సత్యాగ్రహం చేస్తున్న కేజ్రీవాల్ ని బాబు పరామర్శించారు.ఆ సమయంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల అధినేతలను కూడా ఆయన వెంట తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడించారు.
అప్పుడే బాబు కూటమికి ఒకరకంగా మద్దతు వచ్చేసింది.
కానీ కూటమి కూటమి అంటూ చంకలు గుద్దుకున్న పార్టీలు మాత్రం ఆ సమయంలో కనీసం క్రేజీకి మద్దతు తెలిపిన పాపాన పోలేదు.
ఇదేనా కూటమి చెలిమి అంటూ ఎంతో మంది ఎద్దేవా కూడా చేశారు.అయితే ఈరోజు కేంద్రం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాసం మీద మద్దతు ప్రకటించిన ఆప్, ఎపీకి బీజేపీ న్యాయం చేసే వరకు టీడీపీ వెంటే నిలబడతామని ప్రకటించింది…దాంతో ఒక్క సారిగా కూటమి పెద్దలు షాక్ తిన్నారు పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు సరే మరి కూటమిలో ఒక పార్టీ అధినేత ఒక కార్యక్రమాన్ని చేపట్టినపుడు మద్దతు తెలిపే జ్ఞానం కూడా ఉండదా అంటూ మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ వల్ల ఏమీ కాదని ఫిక్స్ అయిన ఆప్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతోంది అంటున్నారు విశ్లేషకులు .