చంద్రబాబు లాంటి గొప్ప నేత.ముందు చూపు ఉన్న నాయకుడు.
ఆలోచనా శక్తి కలిగిన వ్యక్తి.అన్నిటి కంటే ఎంతో రాజకీయ అనుభవం నాయకుడు మరొకరు ఉండరు ఆయన పరిపాలనలో ఏపీ ఉందంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి.
అంటూ గత ఎన్నికల్లో ఎన్నో పొగడ్తలతో ముంచెత్తిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే నోటితో చంద్రబాబు పై విమర్సలు గుప్పించడం ఎంతవరకూ సబబు.అంటే ఆ విజ్ఞత ని పవన్ కే వదిలేయాలి.
అయితే మార్చి 2018 వరకూ కూడా పవన్ కళ్యాణ్ కంటికి తెలుగుదేశం పార్టీ ,నేతలు ,చంద్రబాబు కూడా ఎంతో గొప్ప వ్యక్తులుగా కనపడ్డారు కానీ ఇప్పుడు మాత్రం మోసగాళ్లుగా.అవినీతి పరులుగా కనపడటం ఎవరి దృష్టి లోపమో ప్రజలకి బాగా తెలుసు…పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టిన రోజు మొదలు ఇప్పటి వరకూ కూడా పవన్ కళ్యాణ్ పై తె౩లుగుదెసమ్ పార్టీ నేతలు ఎవరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేయలేదు.పవన్ మాటలని ఖండించారు తప్ప తీవ్రంగా విమర్శించింది లేదు
అంతేకాదు లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసినా సరే లోకేష్ పవన్ కళ్యాణ్ ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు తప్ప పవన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు ఈ విషయంలో లోకేష్ ఎంతో హుందాగా వ్యవహరించారు.నేతలు కూడా ఈ విధమైన సైలినే పవన్ విషయంలో చూపించారు.ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు శ్రుతి మించడం తో నేతలు అందరూ చంద్రబాబు,లోకేష్ ల దగ్గర మోర పెట్టుకున్నారట.పవన్ అన్ని వ్యాఖ్యలు చేసినా సరే మనం సైలెంట్ గా ఉండటం ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అయితే మన పార్టీ కి ప్రజలలో వ్యతిరేక భావన వస్తుంది.
పైగా పార్టీ పై మీపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు మేము ఇక సహించలేము అని తేల్చి చెప్పారట.
దాంతో ఈ విషయంలో చంద్రబాబు కూడా ఇప్పటికే చాలా లేట్ చేశాం ప్రజల ముందు పార్టీ పరువు పోవడం సమంజసం కాదు ఇక పవన్ విషయంలో ఎవరూ ఉపేక్షించి లాభం లేదు పవన్ పార్టీ పై చేస్తున్న దాడిని ఖండించండి అదే సమయంలో ఎప్పటికప్పుడు జనసేన విషయంలో పవన్ విషయంలో ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ నేతలకియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట దాంతో పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే ఎంతో మంది నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలు పెట్టారు.